జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్. బాహుబలి సినిమా తీసి ప్రపంచ సినిమాని తెలుగు వైపుకు చూడగలిగేలా చేసిన రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే డెభ్బై ఐదు శాతం చిత్రీకరణ పుర్తి చేసుకున్న ఈ చిత్రం మిగతా భాగాన్ని శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల స్టార్ట్ అయిన షెడ్యూల్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా జాయిన్ అయ్యాడు.

 

 

అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరంభీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొమరం భీం గా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో ఇంతవరకు రివీల్ చేయలేదు. కొమరం భీంగా ఎన్టీఆర్ నిజాం నవాబులని ఎదుర్కొన్న సన్నివేశాలని ఆల్రెడీ చిత్రీకరించారు. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ సన్నివేశం ఉంది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తాడట. ఆ ఫైట్ సీన్ చాలా బాగుంటుందని సమాచారం.

 

 

మరి అంత బాగున్న సీన్ కి ప్రేరణ కూడా ఉందని అంటున్నారు.  హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 300 లోని ఓ సీన్ స్ఫూర్తితో తెరకెక్కించారని చెబుతున్నారు. 300లో తోడేలుతో బాల యోధుడి పోరాటం ఎంతో స్ఫూర్తిని రగిలించేలా ఉంటుంది. ఆకలితో ఉన్న తోడేలుతో పోరాడే యుద్ధవీరుడైన బాలకుడి కాన్ఫిడెన్స్  తారక్ ఫైట్ కి స్ఫూర్తి అని తెలుస్తోంది. యుద్ధరంగంలో శత్రువు ఎంత బలమైన వాడు అయినా తెలివైన ఎత్తుగడతో తుదికంటా పోరాడి ఎలా నెగ్గాలి? అన్నదే ఆ సీన్ స్ఫూర్తి. 

 

 

ఇప్పుడు ఆ సీన్ ప్రేరణతోనే  టైగర్ తో తారక్ ఫైట్ సీన్ తీసారని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సాధారణంగా రాజమౌళి హీరో ఎలివేషన్ ఓ లెవెల్లో ఉంటుంది. అలాంటిది కొమరం భీమ్ లాంటి యోధుడు పులితో ఫైట్ చేస్తున్నాడంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా థియేటర్లో ఈ సీన్ కి విజిల్స్ పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: