గ్యాప్ ఇచ్చేవాంట్రా.. లేదు వచ్చింది.. ఈ ఒక్క డైలాగ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎందుకు అన్నాడో అల వైకుంఠపురములో రిజల్ట్ చూస్తే తెలిసిపోతుంది.  నా పేరు సూర్య మూవీ డిజాస్టర్ తర్వాత మంచి కథకోసం ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ తనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ సినిమాలు అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నే నమ్ముకున్నాడు.  వీరిద్దరి కాంబినేషన్ లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీ బాక్సాఫీస్ షేక్ చేస్తుంది.  మూవీ రిలీజ్ కి ముందే సామజవరగమన, రాములో రాముల లాంటి సాంగ్స్ తో యూట్యూబ్ షేక్ చేశారు.  ఎన్నో కొత్త రికార్డులు సృష్టించారు. 

 

ఇక మూవీ రిలీజ్ తర్వాత ఫస్ట్ రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరారు.  బన్నీకి ఈ రికార్డు కొత్తతే అని చెప్పొచ్చు. గతంలో తన సినిమాలు బాక్సాఫీస్ హిట్ అయిన ఇంత త్వరగా వంద కోట్ల క్లబ్ లో చేరడం అల వైకుంఠపురములో మూవికి మాత్రమే సాధ్యమైంది.  రెండు వారాలుగా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న అల వైకుంఠాపురానికి రవితేజ డిస్కో రాజా కూడా అడ్డుకట్ట వెయ్యలేకపోయింది. మూడో వారంలోను అల హావ ఇంకా ఆగలేదు. రవితేజ డిస్కో రాజాకి ప్లాప్ టాక్ పడడంతో.. అల్లు అర్జున్ అల వైకుంఠానికి మూడో వారం కూడా లైన్ క్లియర్ అయ్యింది. 

 

మొత్తాని తనకు ఎలాంటి సక్సెస్ కావాలని కోరుకున్నాడో అలాంటి సక్సెస్ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు బన్ని.  ఈ ఏడాది సూపర్ హిట్ మూవీస్ లో బన్నీ అగ్ర స్థానం అని చెప్పుకోవచ్చు.   శనివారం, ఈరోజు ఆదివారం కూడా అల వైకుంఠపురములో మల్టిప్లెక్స్ థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. డిస్కో రాజా కి థియేటర్స్ కొరత ఉన్నప్పటికీ... అల వైకుంఠపురములో సినిమాకి డిస్కో రాజా కన్నా ఎక్కువ థియేటర్స్ ఉండడంతో ఈ వీకెండ్ తాజాగా అల వైకుంఠమే ఉండబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: