టాలీవుడ్ లో నందమూరి హీరోస్ కి ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్, క్రేజ్ ఉంది.  సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ హీరోగా వెండి తెరకు పరిచయం కావడం.. తండ్రి కి తగ్గ తనయుడి గా సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించడం జరిగింది.  ఫ్యాక్షన్ తరహా సినిమాలకు ఆయన పెట్టింది పేరు.  ఎన్నో ఫ్యాక్షన్ తరహా సినిమాల్లో నటించి మెప్పించారు.  బాలయ్య డైలాగ్స్ కి థియేటర్లలో చప్పట్లు, విజిల్స్ తో మారుమోగుతాయి.  అయితే క్రిష్ దర్శకత్వంలో గౌతమి పుత్ర మూవీ తో వంద సినిమాలు పూర్తి చేసుకున్న బాలయ్యకు ఆ తర్వాత వస్తున్న సినిమాలు ఒక్కటీ కలిసి రావడం లేదు. 

 

తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ లో రెండు భాగాలు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడ్డారు బాలయ్య.  ఇంతలో ఏపిలో ఎన్నికలు రావడంతో ప్రచారంలో మునిగిపోయారు.  హిందూపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  ఆ తర్వాత ‘రూలర్’ మూవీలో నటించారు.  ఎన్నో అంచాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో మరోసారి తనకు సింహా, లెజెండ్ లాంటి హిట్స్ అందించిన బోయపాటిని నమ్ముకున్నారు. 

 

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకోసం ఆయన తన సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఈ నేపధ్యంలో జాతకాలు, జ్యోతిష్యాలు నమ్మే బాలయ్య తన టైమ్ బాగోలేదని నమ్ముతున్నారట. ఈ మేరకు ఆయన జపాలు చేయిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. అంతే కాదు బాలయ్య కూడా రూలర్ సినిమా డిజాస్టర్ అవటంతో ఆలోచనలో పడినట్లు...రెమ్యునేషన్ తగ్గించుకుని, నిర్మాతకు సహక రిస్తారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.  ఏది ఏమైనా ఈసారి మంచి హిట్ కాంబినేషన్ వస్తుంది.. ఈ మూవీ గనక హిట్ అయితే కొంత కాలం బాలయ్యకు ఏ ఢోకా ఉండదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: