ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై v v DANAYYA' target='_blank' title='డివివి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డివివి దానయ్య అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిస్తుండగా రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందిస్తుండగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే మూడొంతులు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోలిద్దరి ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటు ఇంటర్వెల్, 

 

అలానే క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఎంతో భారీగా చిత్రీకరించిందట సినిమా యూనిట్. ఇకపోతే సినిమాలోని కీలక  ఫైట్స్ లో ఒకటైన హీరో ఎన్టీఆర్, పులితో తలపడే సీన్ ని అత్యంత భరీగా తెరకెక్కించాడట దర్శకుడు రాజమౌళి. కాగా ఈ సీన్ కు గతంలో హాలీవుడ్ లో వచ్చిన 300 అనే మూవీలో ఒక పిల్లాడు తోడేలుతో పోరాడే సీన్ స్ఫూర్తి అంటూ నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ సినిమాలో బాలుడి వయసు చిన్నది అయినప్పటికీ, క్రూరమైన తోడేలును మట్టికరిపించాలనే దృఢ నిశ్చయంతో అతడు ముందుకు దూకుతాడు. అదే విధంగా ఈ సినిమాలో కూడా వచ్చే ఈ కీలక ఫైట్ లో ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించారని అంటున్నారు. 

 

ఇక ఆయన పులితో పోరాడే సన్నివేశాల్లో వాడే విజువల్ ఎఫెక్ట్స్ రేపు స్క్రీన్ పై అదిరిపోతాయని, తప్పకుండా సినిమా విజయంలో ఈ సీన్ కూడా ఒక మంచి ఆకర్షణగా నిలుస్తుందని సినిమా యూనిట్ భావిస్తోందట. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా, వారి సరసన ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా కొద్దిరోజుల నుండి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై సినిమా యూనిట్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందనను తెలియచేయలేదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: