నాచురల్ స్టార్ నాని 2019 లో జెర్సీ వంటి క్లాసిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే కమర్షియల్ గా మాత్రం సినిమా సక్సస్ అని చెప్పలేము. బాలీవుడ్ లో కూడా జెర్సీ రీమేక్ అవుతున్నపటికి తెలుగులో మాత్రం నిర్మాతలకి ఆశించినంత లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఇక ఈ సంవత్సరం నాని తన 25వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏ హీరో అయినా 25వ సినిమా అంటే చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. హీరోయిజం ఓ రేంజ్ లో ఉండాలనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా కొత్త పంథాలో వెళుతున్నాడు. తన 25వ సినిమాలో హీరోగా కాకుండా విలన్ గా నటించడం విశేషం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న 'వి' సినిమాతో నాని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు బాగా నెలకొన్నాయి.

 

ఒక వైపు 'వి' సినిమాలో విలన్ గా నటిస్తూనే మరో వైపు 'టచ్ జగదీష్' సినిమాలో హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో నటిస్తున్నాడు. చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో ముగ్గురు అన్నదమ్ముల మద్య సంబంధం ఎలా ఉంటుందో చూపిస్తూ దర్శకుడు శివ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే మూడవ సినిమాకు కూడా నాని ఓకే చెప్పాడని తాజా సమాచారం. సమ్మర్ లో ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని ఫ్రెష్ అప్‌డేట్ వచ్చింది.

 

ట్యాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న రాహుల్ సంక్రిత్యన్ నానితో సినిమా సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకున్నాడు. సైన్స్ ఫిక్షన్ బ్యాగ్డ్రాప్ లో కథ రెడీ చేసుకున్న రాహుల్ నానీతో సెట్స్ మీదకు వెళ్ళడానికి సన్నాహాలు మొదలు పెట్టాడు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. 'వి' సినిమాను పూర్తి చేసిన వెంటనే రాహుల్ దర్శకత్వంలో నాని సినిమా మొదలు కాబోతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది 'వి', 'టక్ జగదీస్' సినిమాలతో పాటు రాహుల్ సినిమాని కూడా నాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడని తెలుస్తోంది. 2019 లో కోల్పోయిన ఫాం ని 2020 లో ఫుల్ ఫిల్ చేయాలని నాని తాపత్రయ పడుతున్నాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: