కెరీర్ ముదటి నుంచి ఇమేజ్ అనే చట్రం లో ఇరుక్కుపోకుండా, కమర్షియల్ సినిమాల జోలికి వెళ్ళకుండా విభిన్నమైన కథాంశం ఉన్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. నాని లాగా మినిమం గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు ప్రశాంతంగా కూర్చొని చూసే సినిమాలతో శర్వానంద్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అంతేకాదు శర్వా సినిమాకి ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఉండటం విశేషం. శతమానం భవతి సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శర్వా ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సస్ ని మాత్రం అందుకోలేకపోయాడు. సాయి పల్లవి హీరోయిన్ గా పడి పడి లేచే మనసు, అలాగే కళ్యాణి ప్రియదర్శిణి హీరోయిన్ గా వచ్చిన రణ రంగం సినిమాలు రెండు కూడా శర్వాకి నిరాశని మిగిల్చాయి. 

 

ఇక త్వరలో 'జాను' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వా తమిళంలో సెన్షేషనల్ సక్సెస్ ని అందుకున్న 96 సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న జాను విడుదలకు సిద్దం అవుతుంది. ఇంతలోనే శర్వానంద్ కొత్త సినిమాకి 'శ్రీకారం' చుట్టాడు. తాజా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్రీకారం' ఫస్ట్ లుక్ చాలా చక్కగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. శర్వానంద్ ఒక పల్లెటూరి కుర్రాడి మాదిరిగా లుంగీ కట్టుకుని బుజాన టవల్ వేసుకుని పొలం గట్టున నడుస్తున్న ఈ ఫస్ట్ లుక్ లో స్వచ్చమైన మట్టి వాసన కనిపిస్తోందని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారట.

 

ఇక ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తుండగా కిషోర్ బి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా సమ్మర్ లో శ్రీకారం సినిమాని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి మే లేదా జూన్ ఆరంభంలో విడుదల చేసే అవకాశాలున్నాయని తాజా సమాచారం. జాను తర్వాత చిన్న గ్యాప్ లోనే శ్రీకారం సినిమాతో శర్వా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక జాను, శ్రీకారం సినిమాలతో మళ్ళీ సక్సస్ లు అందుకోవాలని శర్వా ప్లాన్ చేస్తునాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: