అల్లరి సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టిన అల్లరి నరేష్ తనదైన కామెడీ మార్కు అనుకుంటూ వచ్చాడు. తండ్రి ఎంత గొప్ప దర్శకుడైనా ఆ బ్యాగ్రౌండ్ పెద్దగా ఉపయోగించుకోకుండా అనే తన టాలెంట్ తో కామెడీ హీరోగా మంచి సినిమాలు తీశాడు.  రాజేంద్ర ప్రసాద్ సీ,నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి తండ్రులు, తాతలు పాత్రలు చేస్తున్న సమయంలో అల్లరి నరేష్ కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగి పోయాడు.  ఏ హీరోకైనా ఒక టైమ్ అనేది కలిసిరావాలని అంటుంటారు ప్రస్తుతం అల్లరి నరేష్ బాగా బ్యాడ్ టైం నడుస్తుంది అని అంటున్నారు. 

 

సుడిగాడు సినిమా తర్వాత అల్లరి నరేష్ నటించిన ఏ సినిమా కూడా పెద్ద హిట్ కాలేదు.  ఇక లాభం లేదని మల్టీస్టారర్ మూవీలో కూడా నటించాడు.. అది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.  గత ఏడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ లో మహేష్బాబు స్నేహితుడిగా నటించాడు. ఈ పాత్ర నరేష్ కి బాగా కలిసి వచ్చింది. ప్రస్తుతం మరో మూవీ కి రెడీ అవుతున్న అల్లరి నరేష్ ఈసారి కొత్త కాన్సెప్ట్ తో ముందు కనిపించబోతున్న టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

గతంలో అల్లరి నరేష్ నటించిన నేను సినిమా ఒక ఎమోషనల్ పాత్ర ఈ పాత్రలో నరేష్ జీవించాడు. కానీ అప్పటికి నరేష్ కి పెద్దగా పేరు రాకపోవడం వల్ల ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు.  గత ఏడాది మహర్షితో కాస్తోకూస్తో పేరు సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ ఏడాది ఒక మంచి హిట్ కొడితే కొంతకాలమైనా ఇండస్ట్రీలో రాణించగలరని అనుకుంటున్నాడు. మరి 20 అల్లరోడికి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. లేదంటే మనోడు మల్టీస్టారర్ మూవీ కే పరిమితం కావచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: