పెళ్లి చూపుల తో తన ప్రస్థానం మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ.. తర్వాత గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. తర్వాత సందీప్ వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి మూవీ లో నటించాడు. మూవీ విజయ్ దేవరకొండ కెరీర్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ మంచి పేరు సంపాదించారు. తర్వాత గీత గోవింద మూవీ తో మరో సెన్సేషన్ హిట్ అందుకున్నాడు.  ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది.. విజయ దేవరకొండ పై దర్శక నిర్మాతలు పెద్దపెద్ద అంచనాలు వేసుకుంటున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన  టాక్సీవాలా సూపర్ హిట్ అందుకుంది.

 

అయితే  గీత గోవిందం కాంబినేషన్ లో డియర్ కామ్రేడ్ సినిమా తెరకెక్కించారు. ఈ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.. కానీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ సిల్వర్ మూవీలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ.. ఇటీవల ఈ మూవీకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. అయితే టీచర్ పై కొన్ని ప్రశంసలు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఈ టీజర్ లో విజయ్ దేవరకొండ చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ స్మార్ట్ శంకర్ తో గత ఏడాది పూరి జగన్నాథ్ బంపర్ హిట్ అందుకున్నాడు. టెంపర్ తర్వాత ఈ దర్శకుడు ఒక్క హిట్ కూడా అనుకోలేదు దాంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరి జగన్నాథ్ కి ఇస్మార్ట్ శంకర్ తో ఆ కోరిక తీరిపోయింది.

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఫైటర్ మూవీ తెరకెక్కుతున్న టు తెలిసింది. అయితే ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. మరి పూరి ఇ మరోసారి ఇ స్మార్ట్ శంకర్ లెవల్లో అనుకుంటా డా చూడాలి. ఒకవేళ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఏమాత్రం తేడా వచ్చినా ఆ ప్రభావం ఇద్దరిపై ఉంటుంది. విజయ్ దేవరకొండ కు మరో భారీ విజయాన్ని అందిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: