ఎందుకనో టాలీవుడ్ లో సునీల్ చాప్టర్ క్లోజ్ అన్న మాటలు బాగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం ముమ్మాటికి సునీలే అని చెప్పాలి. ఎందుకంటే కమెడియన్ గా మంచి ఊపులో ఉన్నప్పుడే రాంగ్ స్టెప్ వేశాడు. హీరోగా స్టార్ డం ని సంపాదించుకోవాలని తాపత్రయపడి మొత్తానికే పడిపోయాడు. గట్టిగా రెండు హిట్స్ రెండు యావరేజ్ సినిమాలు తప్ప సినీల్ కి మిగతావన్ని ఫ్లాప్ కిందే లెక్కపెట్ట వచ్చు. అదే మాట సునీల్ ని అడిగితే మాత్రం ఫైర్ అవుతాడు. ఆయన ఫైర్ అయినా ఫైర్ అంటించుకున్న అదే నిజం. అందుకే సైలెంట్‌గా హీరో వేషాలను పక్కన పెట్టి ..ముందులాగా రకరకాల పాత్రలను ట్రయ్ చేస్తూ, ఇండస్ట్రీలో ఎలాగైనా మళ్లీ నిలదొక్కుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ సరైన పాత్ర పడడం లేదు. సునీల్ స్నేహితుడు త్రివిక్రమ్ కూడా అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో సరైన పాత్రలు ఇవ్వలేదు. లేదంటే సునీల్ మళ్ళీ ఈ రెండు సినిమాలతో పుంజుకునేవాడే.

 

ఇక దురదృష్ఠం కొద్ది వేరే సినిమాల్లో వచ్చిన పాత్రలు కూడా అంతగా క్లిక్ అవడం లేదు. రవితేజ నటించిన డిస్కోరాజాలో ట్విస్ట్ ఇచ్చి, విలన్ గా టర్నింగ్ తీకున్నాడు. సినిమా సంగతి ఎలా వున్నా, సునీల్ ట్విస్ట్ దగ్గర మాత్రం కాస్త డిఫరెంట్ గా పీలయ్యారు. నిజానికి ఈ సినిమా మీద సునీల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా విజయం సాధించకపోవడంతో ఈ పాత్ర జనాలకు చేరలేదు. అంతేకాదు రవితేజ సినిమాలో సునీల్ విలన్ అంటే కామెడీగానే తీసుకుంటున్నారు తప్ప సీరియస్ గా తీసుకుంటున్న వాళ్ళు లేరు.

 

అయినప్పటికి ఇప్పుడు మళ్లీ మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోడానికి సునీల్ కు ఇంకో అవకాశం వచ్చినట్లు తాజా సమాచారం. నట సింహం నందమూరి బాలకృష్ణ తో చేస్తున్న సినిమాలో దర్శకుడు బోయపాటి ఓ పాత్రను సునీల్ కు ఆపర్ చేసినట్లు తెలుస్తోంది. జస్ట్ హీరో పక్కన వుండే రొటీన్ కమెడియన్ పాత్రనో లేదా మరోటో అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. బోయపాటి అయినా కనీసం సునీల్ కు లైఫ్ ఇస్తారేమో చూడాలి. ముందులాగా నువ్వే కావాలి, నువ్వే నువ్వే, మనసంతా నువ్వే, మన్మధుడు, మల్లీశ్వరి, ఇంద్ర వంటి సినిమాలు పడాలి. లేదంటే సునీల్ కి అటు కమెడియన్ గా ఉన్నది, హీరోగా వచ్చినది రెండు పోయి ఎటు కాకుండా అయిపోతాడని చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: