ఈ మద్య సెలబ్రెటీలు కొన్నిసార్లు చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నాయి.  తర్వాత తాము ఆ ఉద్దేశంతో అనలేదు బాబో అని లబో దిబో అంటున్నారు.  కొన్ని సార్లు అయితే ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు అవుతున్న విషయం తెలిసిందే.  తాజాగా ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ సెలబ్రెటీలు.  బాలీవుడ్ లో వచ్చే కామెడీ షోస్ లో తనదైన కామెడీ తో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించిన టివి నటి భారతీ సింగ్ తాజాగా ఇప్పుడు పంజాబ్, హర్యానా హైకోర్టు మెట్టు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.  షూటింగ్‌లో ఉండగా ఆమెకు తీవ్రమైన కడపునొప్పి వచ్చింది. దీంతో ఆమెను తక్షణమే ఆస్పత్రికి తరలించారు. భారతిని వైద్యులు పరీక్షించారు. ఆమెకు కాలేయ చికిత్స చేయాలని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతి ఓ ఫొటోను పోస్ట్ చేశారు. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  తాజాగా ఇప్పుడు ఆమె కోర్టు కేసు విషయం కూడా సెన్సేషన్ అయ్యింది.

 

వివరాల్లోకి వెళితే..   క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, కమెడియన్ భారతీ సింగ్ లపై అమృత్‌సర్‌ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  కాగా.. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టివేయాలని, కేసుకి సంబంధించిన విచారణపై స్టే విధించాలని భారతీసింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఏ మతానికి చెందిన మనోభావాలను తాను కించపరచలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

 

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ లో ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్, ఫరా ఖాన్, భారతీసింగ్ లు క్రైస్తవ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా వివిధ సెక్షన్ల కింద అమృత్‌సర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. దాంతో రవీనా టాండన్, ఫరా ఖాన్ జనవరి 23న హైకోర్టుని ఆశ్రయించగా.. వారిద్దరిపై మార్చి 25వరకు ఎలాంటి బలవంతపు విచారణ చేపట్టకూడదని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో భారతి సింగ్ కోర్టుని ఆశ్రయించారు. భారతీసింగ్ దాఖలు చేసిన పిటిషన్ నేడు పంజాబ్, హర్యానా హైకోర్టులో విచారణకు రానుందని ఆమె తరఫు లాయర్ అభినవ్ సూద్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: