టాలీవుడ్ హీరోల్లో పెళ్లికి రెడీగా ఉన్న‌ హీరోల్లో నిఖిల్ ఒక‌డు.  క‌ర్ణాట‌క‌లోని మాజీ సీఎం కుమార‌స్వామి కొడుకు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు నిఖిల్‌ వారి బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారాని స‌మాచారం. అయితే ఆ అమ్మాయి త‌న త‌ల్లి త‌రుపు బంధువుల‌ని స‌మాచారం. ఆ అమ్మాయి రాజ‌కీయ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన అమ్మాయి అని తెలుస్తుంది. ఇలా సొంత పార్టీలో ఉన్న బంధువుల కుటుంబానికి చెందిన అమ్మాయిని నిఖిల్ పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

 

గ‌తంలో కుమార‌స్వామి కొడుకు నిఖిల్ సినిమాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. జాగ్వార్ అనే సినిమాతో నిఖిల్ హీరోగా వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వ‌గా..ఆ సినిమాని కన్నడతో పాటు తెలుగులో కూడా తెరకెక్కించారు. అయితే నిఖిల్ మొదటి సినిమా అభిమానులని అంతగా ఆకట్టుకో లేకపోయింది. ఆ తర్వాత కన్నడ లో  త‌న జాత‌కాన్ని ప‌రీక్షించుకోడానికి వెళ్ళాడు ఒకటీ అర సినిమాలు చేసినప్పటికీ కూడా ఆయన కి అక్క‌డ కూడా పెద్దగా కలిసి రాలేదు. అలాగే నిఖిల్ కొన్ని రోజుల ముందు వచ్చిన మహా భారత సినిమాలో అభిమన్యుడి పాత్ర‌లో న‌టించి మెప్పించాడు.

 

ఇక ఇదిలా ఉంటే నిఖిల్ ఒక తెలుగ‌మ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. గ‌తంలో కూడా నిఖిల్‌కి ఒక అమ్మాయితో పెళ్ళి కుదిరిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి. తాజాగా ఇప్పుడు నిఖిల్ బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకోబోతునట్టుగా వార్తలు వెలువడంతో అయన అభిమానులు ఆనందంలో మునిగి పోయారు. రీసెంట్ గా వచ్చిన అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్.. కెరియర్ లో ఒక క్రేజీ ఆఫర్ అందుకున్నాడు. అర్జున్ సురవరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని చూపించాడు నిఖిల్. అలా చిరుని పోగిడాడో లేదో ఇలా మెగా ఛాన్స్ పట్టేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: