సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ తాము నటించిన సినిమాలను విడుదల చేశారు. రెండు సినిమాలు పోటాపోటీగా వచ్చినా గానీ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ రావడంతో అదేవిధంగా త్రివిక్రమ్ డైరెక్షన్ కావడంతో కలెక్షన్ లో అదరగొట్టే రేంజ్ లో వచ్చాయి. జనవరి 12వ తారీకు న విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో నైజాంలో అదేవిధంగా ఓవ‌ర్‌సీస్‌లో బన్నీ కెరీర్ లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది.

 

గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలకంటే ‘అల వైకుంఠపురములో’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ‘నాపేరు సూర్య…’ లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాకి అల్లు అర్జున్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అదేవిధంగా మ్యూజికల్ గా తమన్ అదరగొట్టే సంగీతం ఇవ్వటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉండటంతో...సినిమా విడుదలయ్యాక అంచనాలకు తగ్గ విధంగా త్రివిక్రమ్ డైరెక్టర్ చేయటంతో అల వైకుంఠపురములో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరియు అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా హిట్ గా నిలిచింది.

 

త్రివిక్రమ్ కి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో యు.ఎస్‌లో ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు $3,420,402 (24 కోట్లు సుమారుగా) వ‌సూళ్ల‌ను సాధించినట్టు సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే మహేష్ బాబు హీరోగా చేసిన భ‌ర‌త్ అనే నేను సినిమా పేరిట ఉన్న ఓవ‌ర్‌సీస్ నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను ఈ సినిమా ద్వారా బన్నీ అధిగ‌మించి నాలుగో స్థానంలో నిలిచిన‌ట్లు టాక్. సంక్రాంతి పండుగ అయినా గాని సినిమాకి ఇంకా ప్రేక్షకులు వస్తున్న తరుణంలో సినిమా నిర్మాతలు ఫుల్ లాభాలు పొందినట్లు ఇండస్ట్రీలో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: