బాలీవుడ్ లో బాలనటిగా కెరీర్ ప్రారంభించి తెలుగు లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక.  ఈ మూవీలో అందమైన సన్యాసినిగా చాలా క్యూట్ గా కనిపించింది.  మొదటి సినిమా మంచి సక్సెస్ కావడంతో తెలుగు లో వరుసగా ఛాన్స్ లు రావడం మొదలయ్యాయి.  అంతలోనే ఈ అమ్మడు కాస్త బొద్దుగా తయారు కావడంతో ఒక్కసారే తెలుగు లో ఛాన్సులు తగ్గుముఖం పట్టాయి. దాంతో కోలీవుడ్ కి పయణం అయ్యింది.. అక్కడ వరుస ఛాన్సులు దక్కించుకుంది.  బాలీవుడ్ నుంచి వచ్చినప్పటికీ అక్కడికి వెళ్లకుండా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించింది.  అందుకే ఈ బ్యూటీ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  స్టార్ హీరోల సరసన నటిస్తూ అందరి మన్ననలు పొందింది. 

 

ఈ అమ్మడు బొద్దుగా.. బబ్లీగా ఉండటంతో స్టార్ హీరోలు సైతం హన్సికకు ఎక్కువ ఓటు వేశారని ఆ మద్య వార్తలు వచ్చాయి.  ఆ మద్య  హర్రర్ మూవీస్ లో నటిస్తూ మంచి నటన ప్రదర్శించిన హన్సిక ఈ మద్య చాలా స్లిమ్ గా తయారయ్యింది.  దాంతో ఈ బ్యూటీ ఓ సంచలన నిర్ణయం తీసుకుందట.  ఇప్పటి వరకు హీరోలతో డ్యాన్స్ లు చేస్తూ.. గ్లామర్ గా కనిపించింది చాలని.. ఇక నుంచి మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తుందట.  కెరీర్‌లో ముందుకెళ్లాలంటే చేసే పాత్రల్లో మార్పు తప్పనిసరి అనిపించింది.

 

అందుకే పాత్రలు ఛాలెంజింగ్‌గా ఉంటేనే నటించడానికి ఒప్పుకుంటున్నా అని అంటోంది హన్సిక. మరి ఈ అమ్మడు తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రల్లో నటిస్తుందో చూడాలి.  ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు గ్లామర్ కన్నా ఎక్కువగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  అనుష్క, త్రిష, నయనతార, కాజల్ లాంటి హీరోయిన్లు గ్లామర్ డోస్ తగ్గించి నటనకే ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: