టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా సినిమా అలవైకుంఠపురములో మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ ఈ సినిమాలో అదిరిపోవడంతో పాటు బన్నీ స్టన్నింగ్ పెర్ఫార్మన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఫైట్స్, ఎంటర్టైన్మెంట్ వంటి అంశాలు ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. దానితో పాటు సంక్రాంతి సీజన్ కావడంతో సినిమాకు మరింత బాగా కలెక్షన్స్ వచ్చాయి. మరోవైపు సినిమాలోని సాంగ్స్ కూడా అటు ఆడియో పరంగానే కాక, విజువల్ గా కూడా మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో సినిమా యూనిట్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 

 

నిన్న ఈ సినిమా పాటల రచయితలు, సంగీత దర్శకుడు థమన్ తో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం నిర్వహించిన దర్శకుడు త్రివిక్రమ్, నేడు హీరో అల్లు అర్జున్ తో కలిసి సక్సెస్ మీట్ లో పాల్గొని మీడియా వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇక ఈ మీట్ లో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఇది సమిష్టి విజయం అని, మా సినిమాకు పని చేసిన లైట్ బాయ్ దగ్గరి నుండి దర్శకుడు త్రివిక్రమ్ గారి వరకు ప్రతి ఒక్కరికీ కూడా సినిమా మంచి సక్సెస్ సాధించిన సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు బన్నీ. ఇకపోతే ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలకు ఎక్కువగా మెగా హీరోల నుండి మీకు మంచి అప్లాజ్ లభించేది, అటువంటిది మీ సినిమా రిలీజ్ అయిన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్వీట్స్ చేసారు కదా, 

 

దానికి మీ రియాక్షన్ ఏంటి అని ఒక మీడియా మిత్రుడు వేసిన ప్రశ్నకు బన్నీ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. తనకు మొదటి నుండి తారక్ అంటే ప్రత్యేకమైన అభిమానం అని, ఇద్దరం కూడా ఒకరిని మరొకరం బావ బావ అని పిలుచుకునేంత చనువు మా మధ్యన ఉందని అర్జున్ అన్నారు. ఇక తమ సినిమా ఎంతో నచ్చిందని, అలానే సినిమా మరింతగా సక్సెస్ కావాలని కోరుకుంటూ తారక్ చేసిన ట్వీట్ కి సభా ముఖంగా నేడు ప్రత్యేక అభినందనలు తనకు తెలియచేస్తున్నాను అని అన్నారు అర్జున్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: