తెలుగు సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసిన నటి ప్రగతి, కెరీర్ తొలినాళ్లలో తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వాస్త‌వానికి ప్రగతి కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉండగా చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనల్లో కనిపించింది. ఆ ప్రకటన చూసిన తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ తన సినిమా వీట్ల విశేషంగాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు. ఇక అప్ప‌టి నుంచి ఆమె సినీ కెరీర్ ప్రారంభ‌మైంది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాళం సినిమాల్లో నటించిన ప్రగతి, అనంతరం కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. తెలుగులో 'ఏమైంది ఈవేళ' సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం కూడా అందుకుంది.

 

ఎంగేజ్ లోనే తన వయసుకి సమానంగా ఉండే హీరో, హీరోయిన్లకు తల్లిగా నటించి మెప్పించింది ఈ ప్ర‌గ‌తి అంటీ. తెలుగు ఇండస్ట్రీ లో ప్రతి ఒక్క సినిమాలో తన కామెడి తో అభిమానులను అల్లాడిస్తుంది. ముద్దు ముద్దుగా మాటల తూటాలు పేలుస్తూ ఉంటుంది. . హీరో, హీరోయిన్ లకు తల్లి, అక్క, వదిన, అత్త వంటి హోమ్లీ పాత్రల్లో రాణిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ క్ర‌మంలోనే  ప్రగతి అంటే ‘యంగ్ మదర్’ అనే ట్యాగ్ కూడా సంపాదించుకుంది. ఇక ఇటీవ‌ల వ‌చ్చిన ఎఫ్‌2 సినిమాలో త‌మ‌న్నా, మెహ్రీన్‌ల‌కు త‌ల్లిగా ప్రగతి ఆంటీ కామెడి అంతా ఇంతా కాదు.

 

సినిమాల్లో ప్రగతి తల్లి పాత్రలు పోషించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం గ్లామరస్ గా కనిపిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవ‌ల ఈమె పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా ఆ ఫోటో అయితే యూత్ ని తెగ హీటో పుట్టిస్తోంది. ఎందుకంటే ఆ ఫోటోలో భుజంపైన పచ్చబొట్టు, స్లీవ్ లెస్ బ్లౌజ్, చీర ధరించి సూపర్ హాట్ గా కనిపించింది. అంతేకాదండోయ్ అద్దంలో ఆమె వెనక భాగం కనిపించడం హైలైట్ అని చెప్పాలి. ఇక ఈ ఫోటో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. అందులో కొంద‌రు సూప‌ర్ అంటీ అంటుంటే.. మ‌రికొంద‌రు ఎప్పుడూ త‌ల్లి పాత్ర‌లేనా గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌కు ట్రై చేయ‌కూడ‌దు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: