ఇప్పటివరకు ప్రేమకథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నాగ శౌర్య, ఇప్పుడు అసలు సిసలైన యాక్షన్ ను చూపించేందుకు జనవరి 31 న అశ్వథామ గా తెరపైకి వస్తున్నాడు.. నాగ శౌర్య, సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుండగా రమణ తేజ దర్శకత్వంలో, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్.. ఇది అతని సొంత బ్యానర్లో తన తల్లిని నిర్మాతగా మార్చి ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు.

 

 

కాగా నాగ శౌర్యకు ఇప్పుడు హిట్ చాలా అవసరం. ఎందుకంటే ఛలో సినిమా తర్వాత వచ్చిన మార్కెట్ ను వరసగా మూడు ప్లాపులతో చేజేతులా పోగొట్టు కున్నాడు. ఛలో తర్వాత చేసిన కణం, అమ్మమ్మ గారిల్లు, నర్తనశాల ఇలా వరుసగా సినిమాలు పరాజయం పొందడంతో నాగ శౌర్య ఉనికికే ప్రమాదం ఏర్పడింది. దీంతో తనలో మరింతగా కసి పెంచుకుని ఈసారి ఎలాగైనా హిట్ టాక్ సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో, అశ్వథామ కథను తనే సొంతంగా రాసుకుని, ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను కొత్త దర్శకుడు రమణ తేజ చేతుల్లో పెట్టాడు.

 

 

ఇకపోతే ఈ చిత్రం కోసం నాగ శౌర్య, రఫ్ అండ్ టఫ్ లుక్ లోకి మారిపోయి. బాడీని బిల్డప్ చేసాడు. అంతే కాదు యాక్షన్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి శతవిధాలా ఈ చిత్రం ద్వారా ప్రయత్నించాడు.. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇక సినిమా చూసిన సెన్సార్ అధికారులు క్లిన్ యూ/ ఏ సర్టిఫికెట్ జారీ చేయడమే కాకుండా ఈ చిత్రం చాలా బాగుందని, ఇప్పటి వరకు కనిపించని విధంగా శౌర్య  ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించాడని, కచ్చితంగా హిట్ గారంటీ అని  కాప్లిమెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

 

 

ఇకపోతే సెన్సార్ వారి నుంచి పోజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ ఫుల్ కుషిగా ఉందట.. ఇదే కాకుండా ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్స్ , ట్రైలర్ సినిమా  అంచనాలను పెంచడంతో   ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు , సినీ లవర్స్ ఉత్సహం కనపరుస్తున్నారని సమాచారం.. ఏది ఏమైనా నాగ శౌర్య కృషి ఫలించి ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆశిద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: