ప్రస్తుతం టాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్న సునీల్ ని కెమెడియన్ అనాలో లేక హీరో అనాలో ప్రేక్షకులకు తెలీని పరిస్థితి. ఈ పరిస్థితిని సునీల్ తనంతట తానే తెచ్చుకున్నాడు. కెరీర్ బిగినింగ్ లో మంచి మంచి కామెడి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. చెప్పాలంటే క్షణం తీరిక లేనంతగా బిజీ అయ్యాడు. హీరో ఎవరైనా సునీల్ కోసం ఒక పాత్ర ఉండాల్సిందే. ఈ సినిమాలో సునీల్ ఉన్నాడా ..అయితే వెళదాం పదండి అనుకునే రేంజ్ ఓ సునీల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అంతేకాదు హీరోలు కూడా సునీల్ క్యారెక్టర్ ఉందా మన సినిమాలో అనేలా హీరోలని బాగా అట్రాక్ట్ చేశాడు. 

 

అయితే ఆ తర్వాత ఎందుకనో సునీల్ కి హీరో అవ్వాలనిపించింది. అవాలనిపించిందో లేక అయ్యోలా చేశారో గాని సునీల్ వరుసబెట్టి హీరోగా సినిమాలు చేశాడు. మొదటి సినిమా పూల రంగడు హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సునీల్ ని మర్యాద రామన్న తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సునీల్ క్రేజ్ ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళి పోయింది. మంచి మార్కెట్ వచ్చింది. హీరోగా మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీ అయ్యాడు. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. సునీల్ కి ఒక్కసారిగా ఫ్లాపులు పడ్డాయి. దాంతో అనుకున్న ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అయ్యాయి. కొన్ని తనే రిజక్ట్ చేశాడు.

 

ఇక అప్పటి నుంచి కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నాడు. ఇది చూడలేక సునీల్ స్నేహితుడు .. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తారక్ పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటించిన అరవింద సమేత వీర రాఘవ లో క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్ సునీల్ కి అంతగ ఉపయోగపడగపోయినా ఏవో క్యారెక్టర్స్ వస్తున్నాయి. అందులో భాగంగా మాస్ మహారాజ రవితేజ నటించిన డిస్కో రాజ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే అది సునీల్ చేయాల్సిన క్యారెక్టర్ కాదని అంటున్నారు. ఇది చేయడం వల్ల సునీల్ కి ఒరిగిందేమీ లేదని చెప్పుకుంటున్నారు. అసలు సునీల్ విలన్ అంటే ఎవరికైనా చూడాలనిపిస్తుందా అన్న మాట బాగా వినిపిస్తుంది. పైగా రవితేజని అంటున్నారు. ఇలాంటి క్యారెక్టర్ ని సునీల్ కి ఎందుకు సజెష్ చేశాడని. అసలు సునీల్ సినీ కెరీర్ లో ఆయన చేసిన అత్యంత పరమ చెత్త క్యారెక్టర్ ఇదేనని చెప్పికుంటున్నారు. ప్రేక్షకులే కాదు తన క్లోజ్ ఫ్రెండ్ మాటల మాంత్రీకుడు డైరెక్టర్ త్రివిక్రం కూడా అనుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: