తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి ఉన్న ఫాలోయింగ్ వేరే అన్న విషయం అందరికి తెలిసిందే. ఆయన సినిమా అంటే ఈ వర్గం ఆ వర్గం అన్న తేడాలుండవు. అన్ని రకాల ప్రేక్షకులు థియోటర్స్ కి పరుగెత్తుకొస్తారు. ఇక ఆయన డైరెక్షన్ లో హీరోలని చూడాలంటే ప్రేక్షకులు ఆరాటంగా ఎదురుచూస్తారు. హీరో ఎవరైన పూరి స్టైల్ కి మోల్డ్ అవ్వాల్సిందే. ఆయన మొదటి సినిమా బద్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసి సంచలనం సృష్ఠించారు. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కి గొప్ప ఇమేజ్ ని తీసుకు వచ్చింది. అంతేకాదు ఆ సినిమాతో పూరి పేరు కూడా మార్మోగిపోయింది. దాంతో హీరోలందరు పూరి సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించారు. పూరిహీరో తో సినిమా తీసినా ఆ సినిమా రికార్డ్ స్థాయిలో సక్సస్ ని సాధించింది. 

 

బద్రి, పోకిరి, బిజినెస్ మాన్, ఇడియట్, అమ్మా నాన్నతమిళ అమ్మాయి, శివమణి, టెంపర్, బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో బుడ్డా, రీసెంట్ గా రాం తో తీసిన ఇస్మార్ట్ శంకర్ ఇలా చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ సృష్ఠించాయి. అయితే పూరి సొంత నిర్మాణ సంస్థ వైష్ణో అకాడమీ బ్యానర్ ని స్థాపించి బ్లాక్ బస్టర్స్ ని అందించారు. ఇడియట్, అమ్మా నాన్నతమిళ అమ్మాయి, పోకిరి, 143, శివమణి ..వంటి సూపర్ హిట్ సినిమాలని తెరకెక్కించారు పూరి. అయితే ఆ సక్సస్ ఫుల్ బ్యానర్ ని ఎందుకనో పూరి సడన్ గా వదిలేశారు. ఈ బ్యానర్ తర్వాత పూరి టూరింగ్ టాకీస్ అన్న పేరు పెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆ బ్యానర్ కి అనుబంధ బ్యానర్ ని స్థాపించారు. ఈ బ్యానర్ కి చార్మి కూడా నిర్మాతగా ఉంది. పూరి కనెక్ట్స్ అన్న పేరు తో ఉన్న ఈ బ్యానర్ కి పూరి-చార్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

 

పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలు ఈ బ్యానర్స్ మీదే నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి ఈ బ్యానర్ మీదే విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరోపక్క పూరి కొడుకుతో రొమాంటిక్ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఇక విజయ్ దేవరకొండ తో ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాని నాలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకి కరణ్ జోహర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి పూరి టీం ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: