సునీల్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే కక్కలేక మింగలేక అన్నట్టు ఉంది. ఉన్నవాడు కుదురుగా ఉండక హీరో అయిపోయాడు. లైఫ్ కే చిక్కులు తెచ్చుకున్నాడు. అసలే మన తెలుగులో కమెడియన్స్ కొరత బాగా ఉంది. అలాంటిది సునీల్ అతి తక్కువ కాలంలోనే మంచి కమెడియన్ గా పాపులర్ అయ్యాడు. రెమ్యూనరేషన్ కూడా బాగా అందుకున్నాడు. ప్రతీ హీరో సునీల్ కి క్యారెక్టర్ రాయండి అంటూ దర్శక, రచయిలకు చెప్పి డిమాండ్ చేసే స్థాయికి సునీల్ రావడం గొప్ప విషయం. వాస్తవంగా చూస్తే అంత తక్కువ కాలంలో కమెడియన్ గా పాపులర్ అయిన వాళ్ళు చలా తక్కువేనని చెప్పాలి. కాని సునీల్ దీన్ని బ్రేక్ చేశాడు.

 

అయితే కమెడియన్ గా కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే హీరో అయిపోయాడు. లావుగా ఉన్నప్పటికి బాగా డాన్స్ చేయగలగడం సునీల్ కి పెద్ద ప్లస్ అని చెప్పాలి. దాంతో చటుక్కున హీరో అయిపోయాడు. వరుసగా సినిమాలు చేశాడు. దర్శక ధీరుడు రాజమౌళి కూడా సునీల్ తో సినిమా తీయాలనిపించేలా ఆకట్టుకున్నాడు. మర్యాద రామన్న సినిమాతో సునీల్ ఇండస్ట్రీలో బాగా క్రేజ్ ని సంపాదించుకున్నారు. నాలుగు సినిమాలు బాగానే ఆడాయి. ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. సునీల్ ని నమ్మి డబ్బు పెట్టిన ప్రతీ నిర్మాత నష్టపోవాల్సి వచ్చింది. దాంతో ఎందుకులే ఈయనతో సినిమాలనుకొని సునీల్ తో కమిటయిన నిర్మాతలందరు డ్రాపయ్యారు. అంతే ఇక సునీల్ ఖాలీ అయిపోయాడు. 

 

అయితే ఇది చూడలేని సునీల్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ ఎన్.టి.ఆర్ తో తీసిన అరవింద సమేత లో మళ్ళీ కమెడియన్ గా నిలబెట్టడానికి ఒక పాత్ర ఇచ్చాడు. అంతేకాదు సంక్రాంతికి వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో లోను ఒక క్యారెక్టర్ ఇచ్చాడు త్రివిక్రం. అయితే ఇవేవి సునీల్ కి ఉపయోగపడలేదు. దానికితోడు మాస్ రాజా రవితేజ సినిమాలో చేసిన విలన్ క్యారెక్టర్ కూడా బెడిసి కొట్టింది. అసలు సునీల్ ని అలా చూడటానికి జనం ఏమాత్రం ఇష్టపడలేదు. దాంతో సునీల్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఏదో బాలయ్య సినిమాలో ఒక పాత్ర బోయపాటి ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది గాని అది కూడా వీటిలాగే అయితే ఇక సునీల్ కి కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం అని చెప్పుకుంటున్నారు. అందుకే సునీల్ ఒకే ఒక్క దిక్కు అయిన త్రివిక్రం వైపు ధీనంగా చుస్తున్నాడట. ఎందుకంటే ఎప్పటికైనా సునీల్ తో 'బంతి' అనే సినిమా తీస్తానని బహిరంగానే చెప్పారు. అది గుర్తొచ్చే సునీల్ త్రివిక్రం ని వేడుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది.     

 

మరింత సమాచారం తెలుసుకోండి: