ప్రస్తుతం ఎస్.ఎస్.తమన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఏ సినిమా చూసిన మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పేరే కనిపిస్తుంది. ఈ మధ్య త్రివిక్రం అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకి తమన్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. వాస్తవంగా త్రివిక్రం ఎక్కువ సినిమాలు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తో కలిసి పని చేశారు. అయితే ఉన్నపలంగా ఎందుకనో మాటల మాంత్రీకుడు దేవిని వద్దని వేరే వాళ్ళని తీసుకున్నారు. నితిన్ తో తీసిన అ..ఆ సినిమాకి మిక్కి.జే.మేయర్ ని తీసుకున్నాడు. ఆ తర్వాత అజ్ఞాతవాసి సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ని పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా అటు పవన్ కళ్యాణ్ స్థాలో గాని, ఇటు త్రివిక్రం స్థాయిలో గాని లేకపోవడంతో మ్యూజిక్ పరంగా సినిమా ఫ్లాప్ అన్న మాట వినిపించింది.

 

 ఆ తర్వాత ఎన్.టి.ఆర్ తో తెరకెక్కించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాకి తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు త్రివిక్రం. ఆ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దాంతో త్రివిక్రం అల్లు అర్జున్ తో తెరకెక్కించిన అల సినిమాకి తమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం తో దేవికే పంచ్ పడిందా అన్న టాక్ వినిపించింది. అందుకు తగ్గట్టుగానే తమన్ అల కి సూపర్బ్ ఆల్బం ఇచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే అల సినిమా మ్యూజి పెద్ద అస్సెట్ అని చెప్పాలి. సక్సస్ మీట్ లో అల్లు అర్జున్, త్రివిక్రం ఇద్దరు కూడా తమన్ ని పొగడ్తలతో ముంచేశారు. అయితే ఇక్కడే సెంటిమెంటల్ గా ఒక పాయింట్ ఉంది. దేవిశ్రీప్రసాద్ త్రివిక్రం అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్య మూర్తి సినిమాకి దేవిని ఇలానే పొగడ్తలతో ముంచేశారు. 

 

అంతే మళ్ళీ త్రివిక్రం దేవీ తో సినిమా చేయలేదు. ఇప్పుడు అలకి అలానే తమన్ ని పొగిడేశారు. కట్ చేస్తే తమన్ మ్యూజిక్ ఇచ్చిన డిస్కో రాజ డిజాస్టర్ గా మిగిలింది. ముఖ్యంగా మ్యూజిక్ పరంగా సినిమా పెద్ద డిజాస్టర్ అన్న టాక్ వచ్చింది. దాంతో పాటు ఆడియన్స్ తమన్ ని ఏకిపారేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తమన్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయి దేవీశ్రీప్రసాద్ లా మారిపోతాడా అన్న అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు కొంతమంది. ఇక రీసెంట్ గా తమన్ మహేష్ బాబు సినిమాకి ట్యూన్స్ కట్టడం మొదలు పెట్టాడు. మహేష్ తో వరుసగా సినిమాలు చేసి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన దేవి సరిలేరు సినిమాకి వరస్ట్ మ్యూజిక్ ఇచ్చాడన్న టాక్ వచ్చింది. దాంతో సూపర్ స్టార్ దేవి ని పక్కన పెట్టి తమన్ ని లైన్ లోకి తెచ్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: