టాలీవుడ్ సినిమా పరిశ్రమకు భీభత్సం అనే సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన థమన్, ఆ తరువాత రవితేజ, సురేందర్ రెడ్డిల కలయికలో వచ్చిన కిక్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు. ఇక అక్కడినుండి వరుస అవకాశాలతో దూసుకెళ్లిన థమన్ ఆపై మహేష్, ఎన్టీఆర్, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలకు మంచి మ్యూజిక్ అందించారు. అయితే మధ్యలో థమన్ ట్యూన్స్ పై కాపీ అనే ముద్ర పడడంతో బన్నీ నటించిన సరైనోడు తో కొంత బ్రేక్ తీసుకున్న థమన్, ఆపై వచ్చిన తొలిప్రేమ, మహానుభావుడు, అరవింద సమేత, ఇటీవల వచ్చిన అలవైకుంఠపురములో సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక అల మూవీ సాంగ్స్ అయితే థమన్ కు ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చాయి అనే చెప్పాలి. 

 

ఇకపోతే మళ్ళి చాలా గ్యాప్ తరువాత సూపర్ స్టార్ మహేష్, అతి త్వరలో వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికైన థమన్ పై మహేష్ ఫ్యాన్స్ పలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇటీవల అలవైకుంఠపురములో సక్సెస్ మీట్ లో మాట్లాడిన థమన్, తమ సినిమా సాంగ్స్ మంచి సక్సెస్ చేసారు, అలానే సినిమాని ఊహించినదానికంటే మరింత సక్సెస్ ని మీరు అందించారు, కలెక్షన్స్ వచ్చాయి, అందుకే ఒరిజినల్ ఫిగర్స్ ప్రకటించాం అంటూ మాట్లాడడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలే థమన్ పై మహేష్ ఫ్యాన్స్ విరుచుకుపడేలా చేస్తున్నాయి. 

 

అంటే మీ అల సినిమా కలెక్షన్ ఫిగర్స్ ఒరిజినల్, మా మహేష్ నటించిన సరిలేరు సినిమా కలెక్షన్స్ ఫిగర్స్ ఫేక్ అని నీ ఉద్దేశ్యమా అంటూ ఆయనపై కొద్దిరోజలుగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక థమన్ మాత్రం ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సూపర్ స్టార్ మహేష్ నటించిన సినిమాల్లోని పోస్టర్లను, ఫోటోలను ట్యాగ్ చేస్తూ ఇంప్రెషన్ కొట్టేయాలని చూస్తుండడంతో, నువ్వు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా మా సూపర్ స్టార్ తో సినిమా చేయడానికి మాత్రం వీల్లేదు, నీ స్థానంలో మాకు మరొక్కసారి దేవీశ్రీనే కావాలి అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: