మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది. కెరీర్‌లో బంప‌ర్ హిట్ ల‌భించ‌డంతో అమితానందంలో వున్న బ‌న్నీ, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో పాటు చిత్ర బృందం సోమ‌వారం మీడియాని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మాట‌ల మాంత్రికుడు ప‌వ‌న్ గురించి మాట్లాడి మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి.

 

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ఈ చిత్రాన్ని చూశారా అన్న ప్ర‌శ్న‌కు త్రివిక్ర‌మ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌స్తుతం ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా వున్నార‌ని, ఈ టైమ్‌లో సినిమాలు ఎలా చూస్తార‌ని, మ‌రో విష‌యం ఏంటంటే ఆయ‌న సినిమాల‌నే ఆయ‌న చూసుకోరు. మూడు నెల‌ల త‌రువాత చూడాల‌నిపిస్తే చూస్తారు. తాను బ్ర‌తిమాలితేనే 120 రోజుల త‌రువాత `అత్తారింటికి దారేది` చూశార‌ట ప‌వ‌న్‌. ఇదే త‌ర‌హాలో `అల వైకుంఠ‌పుములో`ను చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలి` అని చ‌మ‌త్క‌రించారు త్రివిక్ర‌మ్‌.

 

"ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు" అని చెప్పారు స్టైల్ష్ స్టార్ అల్లు అర్జున్. సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూ 'నాన్ బాహుబలి' రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో అల్లు అర్జున్, త్రివిక్రమ్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు.  ఇండస్ట్రీ హిట్ అని ప్రొడ్యూసర్స్ ఎనౌన్స్ చేశారు. ఇది నా విక్టరీ కాదు. ఇది జనం నాకిచ్చిన ఒక అప్రిసియేషన్ టోకెన్. ఇది నేను ఎంత సంపాదించుకున్నాను అనేది కాదు. ఒక సినిమా రికార్డు వచ్చినప్పుడు అది హీరో ర్యాంకు కాదు. జనం ఆ సినిమాకి ఇచ్చిన ర్యాంకు.

మరింత సమాచారం తెలుసుకోండి: