మాములుగా ఏ హీరోయిన్ అయినా ప్రేమ గురించి ఏమైనా చెప్తే ఎం అని అంటారు? అసలు హీరోయిన్లు ప్రేమ గురించి ఎం అని చెప్తారు ? ప్రేమ సక్సెస్ అయినా వాళ్ళు అయితే ప్రేమ గురించి గొప్పగా చెప్తారు.. అదే లవ్ ఫెయిల్యూర్ అనుకో.. ప్రేమ గురించి వారు చెప్పినట్టు మరొకరు చెప్పలేరు.. అయితే తాజాగా హీరోయిన్ నివేద పేతురాజ్ చెప్పిన విషయాలు వింటే షాక్ అవుతారు. 

 

వివరాల్లోకి వెళ్తే.. నివేద పేతురాజ్ తల్లితండ్రులతో కలిసి దుబాయి లో జీవించేది.. అక్కడే విద్యాబ్యాసం పూర్తి చేసి మోడలింగ్ రంగాన్ని ఎంచుకొని మోడల్ అయ్యింది. అయితే మోడల్ గా బాగా పాపులర్ అవ్వడంతో నటిగా పిలుపు వచ్చింది. దీంతో ఆమె తమిళంలో ఒరు నాళ్‌ కూత్తు చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 

 

ఆలా అడుగు పెట్టిందో లేదో.. సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో వరుస మీద అవకాశాలు వచ్చాయి.. ఈ నేపథ్యంలోనే 2016లో తెలుగు సినీరంగానికీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు దక్షిణాది నాయకిగా మంచి గుర్తింపు పొందింది. అయితే ఇటీవలే విజయ్‌సేతుపతితో జత కట్టిన సంఘతమిళన్‌ చిత్రం నివేదకి మంచి పేరునే తెచ్చి పెట్టింది. 

 

త్వరలో ప్రభుదేవాతో జత కట్టిన పొన్‌ మాణిక్యవేల్‌ చిత్రం తెరపైకి రానుంది.అయితే ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. అయితే ఇన్నాళ్లు సాధారణ అమ్మాయిల కనిపించిన ఈ బురాటీ ఇప్పుడు అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తరచూ వార్తల్లో నిలుస్తుంది. 

 

అయితే ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ ఆమెను ప్రేమ గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించగా.. ప్రేమ గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్న వేశాడు.. ఆ ప్రశ్నకు ఈ నివేద సమాధానం ఇస్తూ ''చెప్పలేని చోట ఏర్పడే బాధలాంటిది ప్రేమ'' అని చెప్పింది. దీంతో ఆ సమాధానంపై నెటిజన్లు మరికొన్ని ప్రశ్నలు వేస్తున్నారు.. ఏంటి మీరు లవ్ ఫెయిల్యూర్ అః? అని ప్రశ్నలు వేస్తున్నారు.. అంతేకాదు ఆమె ప్రేమ గురించి చెప్పిన నిర్వచనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: