‘అల వైకుంఠపురములో’ మూవీ సంక్రాంతి రేస్ విజేత ఆవడమే కాకుండా ఈ మూవీ ఇండస్ట్రీ టాప్ ఫైవ్ హిట్స్ లిస్టులో స్థానాన్ని పొందడంతో ఇప్పుడు ఎక్కడ విన్నా త్రివిక్రమ్ మాటల మ్యానియా కొనసాగుతోంది. వాస్తవానికి ఇలాంటి స్థాయి విజయం ‘అల’ కు వస్తుందని త్రివిక్రమ్ కూడ ఊహించి ఉండడు. 

మూవీ సక్సస్ మ్యానియా ఇలా కొనసాగుతూ ఉండగానే త్రివిక్రమ్ చేయబోయే భవిష్యత్ సినిమాల గురించి కూడ చర్చలు ప్రారంభం అయిపోయాయి. వాస్తవానికి త్రివిక్రమ్ ఇప్పటి వరకు ఏ హీరో మూవీ ప్రాజెక్ట్ తోను అధికారికంగా లింక్ అవ్వలేదు. కానీ జూనియర్ తో ఒక సినిమా చేయాలి అన్న ప్రాధమిక అంగీకారం జూనియర్ త్రివిక్రమ్ ల మధ్య ‘అల’ విడుదలకు ముందే జరిగింది అని అంటారు.

అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయమై క్లారిటీ లేదు. వాస్తవానికి ఇంతవరకు త్రివిక్రమ్ జూనియర్ కు ఈవిషయమై ఒక కథను కూడ వినిపించ లేదు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం కొరటాల సివతో సినిమాను చేస్తున్న చిరంజీవి ఆలోచనలు త్రివిక్రమ్ పై ఉన్నాయి అని అంటున్నారు. గతంలో చిరంజీవి తాను త్రివిక్రమ్ తో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ఓపెన్ గానే చెప్పాడు. 

చిరంజీవి ‘సైరా’ మూవీలో చిక్కుకోవడం ఆ తరువాత కొరటాల ప్రాజెక్ట్ ను ఓకె చేయడంతో త్రివిక్రమ్ తో చిరంజీవి చేయవలసిన మూవీ అటకెక్కింది. దీనితో తిరిగి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ను రివైవ్ చేయాలని చిరంజీవి తన సన్నిహితుల ద్వారా త్రివిక్రమ్ కు వ్యూహాత్మకంగా రాయబారాలు చేస్తున్నట్లు టాక్. వాస్తవానికి వెంకటేష్ త్రివిక్రమ్మూవీ ప్రారంభోత్సవం జరుపుకుని కూడ అటకెక్కింది. ఇప్పుడు వెంకీ మామ చూపులు కూడ త్రివిక్రమ్ పై ఉన్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి. ‘అల’ మూవీ సక్సస్ తరువాత ఇలా చాల మంది టాప్ హీరోలు త్రివిక్రమ్ వైపు చూస్తున్నా త్రివిక్రమ్ చూపులు మాత్రం స్థిరంగా జూనియర్ పైనే ఉన్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: