రామ్ చరణ్ అల్లు అర్జున్ ల మధ్య కనిపించని గ్యాప్ ఉంది అన్న ప్రచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ గాసిప్పులకు మరింత బలం చేకూర్చే విధంగా నిన్న అల్లు అర్జున్ మీడియా ముందు చేసిన కామెంట్స్ ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. 

‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ సాధించింది అంటూ ఈ మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక మీడియా సమావేసంలో బన్నీ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఆ కామెంట్స్ రామ్ చరణ్ గతంలో చేసిన కామెంట్స్ కు పూర్తి భిన్నంగా ఉన్నాయి అంటూ మాటలు వినిపిస్తున్నాయి. 

గతంలో రామ్ చరణ్ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాల్తాడుతూ స్టార్ హీరోల సినిమాల కలక్షన్స్ వివరాలను వాటికి సంబంధించిన పోష్టర్లను విడుదల చేయడం తనకు ఇష్టం లేదు అని చెపుతూ ఇలా చేయడం వల్ల హీరోల మధ్య గ్యాప్ ఏర్పడటమే కాకుండా ఇండస్ట్రీలో అనవసరపు వర్గాలు ఏర్పడతాయి అని కామెంట్స్ చేసాడు. అయితే నిన్నటి మీడియా మీట్ లో బన్నీ దీనికి భిన్నంగా మాట్లాడాడు. ‘అల వైకుంఠపురములో’ మూవీ ఇండస్ట్రీ హిట్ అంటూ తాము విడుదల చేసిన పోస్టర్లు చేస్తున్న ప్రచారం కేవలం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేసుకోవడం కోసం అంటూ కామెంట్ చేసాడు. 


అంతేకాదు ప్రస్తుతం జనం డబ్బు కన్నా తమ విలువైన సమయాన్ని సినిమాలు చూడటం పై ఖర్చు పెట్టడం ఇష్టపడని పరిస్థితులలో ‘అల’ సినిమాకు వచ్చిన ఈ ఘన విజయాన్ని కలక్షన్స్ ఫిగర్స్ ను బయటకు చెప్పకపోతే అది ప్రక్షకులను అవమానించినట్లే అవుతుంది అంటూ కామెంట్ చేసాడు. అదేవిధంగా ఈనాడు ‘అల’ సాధించిన రికార్డులను మరొక మూవీ బ్రేక్ చేస్తుంది అని తనకు తెలిసినా అందరికీ కృతజ్ఞతలు తెలియ చేసుకోవడానికే ఇలాంటి హడావిడి చేస్తున్నాము అంటూ బన్నీ చేసిన కామెంట్స్ చరణ్ అభిప్రాయాలకు పూర్తిగా భిన్నం అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: