పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో కలిసి జగన్ ను ఇరుకున పెట్టె విధంగా చేయాలనుకున్న రాజకీయ వ్యూహాలు కూడ కలిసి రాకపోవడంతో ఇక పవన్ తన దృష్టి అంతా తాను ఒప్పుకున్నసినిమాల పై పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ షూటింగ్ ప్రారంభం అయిన నేపధ్యంలో వచ్చేనెల పవన్ క్రిష్ ల మూవీ షూటింగ్ కూడ ప్రారంభం అవుతుంది అన్న సంకేతాలు అందుతున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ పవన్ నటించబోయే మరో ‘సైరా’ అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. ఈ  మూవీ కథ 19వ శతాబ్దానికి చెందిన ఒక అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుడు జీవితానికి సంబంధించిన ఛాయల తో ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది.

ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మూవీలోని పవన్ పాత్ర నిజాం పాలనలో దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పాలమూరు రాబిన్ హుడ్ గా పేరు గాంచిన పండుగ సాయన్న పాత్ర ఛాయలు పవన్ పాత్రలో కనిపిస్తాయి అని అంటున్నారు. పేద ప్రజలకు తాను దోచుకు వచ్చిన డబ్బును దానం చేసిన పండుగ సాయన్న జీవితం గురించి ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు.

ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడుగా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథ అంతా దేశభక్తి తో నిండిన భావోద్వేగంతో ఉంటుంది కాబట్టి ఈపాత్ర పవన్ భావజాలానికి అన్ని విధాల సరిపోతుందని క్రిష్ పట్టుపట్టి పవన్ ను ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే జనం కు పెద్దగా పరిచయం లేని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రను ఎంతో కష్టపడి చిరంజీవి చేసినా అనుకున్న ఫలితాలు సాధించ లేకపోయాడు. మరి ఇప్పుడు పవన్ చేస్తున్న ఈ పండుగ సాయన్న సాహసం సాధారణ ప్రేక్షకులకు ఎంత వరకు అర్ధం అవుతుంది అన్నదే సమాధానం లేని ప్రశ్న..

 

మరింత సమాచారం తెలుసుకోండి: