ఇష్టం లేని పనిని కష్టంగా చేస్తుంటే ఆ తర్వాత అది ఇష్టంగా మారి తన దగ్గర ఉన్న కష్టాలను దూరం చేస్తుందంటారు. ఇది ప్రభాస్ విషయంలోనే జరిగింది. అదేమంటే తాను హీరో అవుతానని కలలో కూడా అనుకోలేదట. నటించాలనే కోరిక లేనప్పుడు, వచ్చే వ్యాపకం ఏముంటుంది. ఏదో వ్యాపారం చేసుకుందాం లేదా ఉద్యోగం చూసుకుందాం అనుకుంటారు. సరిగ్గా ప్రభాస్ కూడా ఇలానే అనుకున్నాడట. కానీ తన చుట్టు సినిమా వాతవరణమే. ఒక పక్క ఇంట్లో  పెదనాన్న కృష్ణంరాజు హీరో. తండ్రి సూర్య నారాయణరాజు నిర్మాత. కానీ ఏం జరిగిందో తెలియదు ఒక రోజు సడెన్‌ హీరో అవ్వాలనిపించగా ఈ విషయం పెదనాన్నకు చెబితే ఆయన నటనలో శిక్షణ తీసుకోమని విశాఖలోని సత్యానంద్‌గారి దగ్గరకు పంపారట.

 

 

నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే నిర్మాత అశోక్‌కుమార్‌ సినిమా ‘ఈశ్వర్‌’ లో నటించాల్సి వచ్చింది.. అప్పటికి నటనలో ఓనమాలు కూడా సరిగ్గా రాని ప్రభాస్ ‘ఈశ్వర్‌’తో మాస్‌ ఎంట్రీ ఇచ్చి.. ‘వర్షం’ సాక్షిగా విజయ దుందుభిమోగించి.. ‘ఛత్రపతి’గా మెప్పించి.. ‘బుజ్జిగాడి’లా మురిపించి.. అమ్మాయిలకు అభిమాన ‘డార్లింగ్‌’లా మారి ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ లా  ‘మిర్చి’ లాంటి కుర్రాడు అనిపించుకున్న ఈ ‘బాహుబలి’..  దేశం యావత్తూ ‘సాహో’ అనిపించాడు.

 

 

ఇలా ప్రభాస్ చేసినవి తక్కువ సినిమాలే కాని అంతవరకు చేసిన సినిమాలు టాలీవుడ్‌లో ప్రభాస్ పేరుని నిలబెడితే, ఆ తర్వాత వచ్చిన ‘బాహుబలి’తో కేవలం దక్షిణాది నటుడిగానే కాకుండా జాతీయ నటుడిగా ఎదిగారు. ఇక ఆ తర్వాత ‘బాహుబలి’ క్రేజ్‌తో సుజీత్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’ భారీ అంచనాల మధ్య విడుదలైన ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది..

 

 

అయినా గాని ప్రభాస్ కేరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపలేక పోయింది. అయినా ఇప్పటికి భారీ బడ్జెట్ పెట్టి ప్రభాస్‌తో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూలో ఉన్నారు. ఇకపోతే ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినా గాని ఇంతలా పేరును సంపాధించలేరు. కాని అతి తక్కు కాలంలోనే,   తక్కువ సినిమాలతోనే ప్రభాస్‌కు సాధ్యమైంది.  అందుకే వెండితెరను ఏలే ఈ రాజుకు ప్రతి ఒక్క‌రు సాహోనే... 

మరింత సమాచారం తెలుసుకోండి: