బాలీవుడ్ భామ‌లు అందాలు ఒల‌క‌బోయ‌డంలో ఏమాత్రం ఆలోచించ‌రు. అంతేకాక ఏ వ‌య‌సులోనైనా స‌రే హాట్‌గా ఉంటూ కుర్రాళ్ళ‌కి హీటు పుట్టిస్తుంటారు ఈ భామ‌లు. అందానికి వ‌య‌సుతో ప‌నేముంద‌ని బాడీని ఫిట్‌నెస్‌తో మెయింటెయిన్ చేస్తూ... అంద‌ర్నీ అవాక్  అయ్యేలా చేస్తుంటారు.  ఇక ప్ర‌స్తుతం టీనేజ్ హీరోయిన్ల‌తో పోటీ ప‌డుతూ అందుకు మేమేమి త‌క్కువ కాదంటున్నారు ఈ భామ‌లు. న‌ల‌భైల్లో కూడా టూ పీస్ బికినీలు వేసి షాకిస్తూ వ‌స్తున్నారు ఈ భామ‌లు. ఇటీవ‌లె బాలీవెడ్ హాట్ హీరోయిన్ కిమ్‌శ‌ర్మ హాట్ హాట్ టూపీస్ వైట్ బికినీ వేసి అంద‌రూ షాక్ అయ్యేలా చేసింది. స‌ముద్రపు ఒడ్డుపైన తెల్ల‌టి ఆ బికినీల మ‌ధ్య ఆమె ఎద అందాల‌తో కుర్రాళ్ళ మ‌ది చింద‌ర వంద‌ర చేస్తుంది.

 

నాభి సొగ‌సుల‌తో మ‌తిపోగొడుతుంది. ఆమె కూర్చున్న వైనంలో ఆమె తొడ‌లు ఆ ఫిట్‌నెస్ చూస్తే ఎలాంటోళ్ళ‌కైనా మ‌తి పోవ‌ల‌సిందే. ఈ అమ్మ‌డు త‌న హాట్ ఫొటోస్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ సోష‌ల్ మీడియా అంతా నెటిజ‌న్ల కామెంట్ల‌తో హీటెక్కించేస్తుంది. ఈ భామ గ‌తంలో కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఖ‌డ్గం చిత్రంలో ఓ ఐట‌మ్ సాంగ్‌లో చేసిన విష‌యం అంద‌రికీ తెలిసందే. `ముసుగు వేయొద్దు..మ‌న‌సు మీద అంటూ అద‌ర‌గొట్టింది ఈ చిన్న‌ది. అటు పై న‌వ‌దీప్ తో కలిసి యాగం చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా న‌టించింది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన‌ప్ప‌టికీ ఈమెకు అనుకున్న రేంజ్ లో ఫోక‌స్ మాత్రం రాలేదు. దాంతో ఈ భామ బాలీవుడ్‌లో కాస్త గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేసింది. 

 


అడపా దడపా సినిమాల్లో క‌నిపించిన‌ప్ప‌టికీ ఈ అమ్మడు సినిమాల‌కు మాత్రం కాస్త దూరంగానే ఉంది. ఇక లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ భ‌మ మ‌ళ్ళీ ఇలా  హాట్ హాట్ గా బికినీ తో రెచ్చిపోయింది. మరి నలభై ఏళ్ళు దాటినా కూడా కిమ్ శర్మ బికిని అందాలు ఏ రేంజ్ లో షాకిస్తున్నాయో ఆ ఫొటోని చూస్తేనే అర్ధ‌మ‌వుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: