ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు ఆరడుగుల అందగాడు వెంట‌నే మ‌న కళ్లముందుకు వ‌చ్చిన‌ట్టు అనిపిస్తుంది. `ఈశ్వర్` సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్‌లా ర‌ఫ్ఫాడిస్తున్న‌ మిస్టర్ పర్‌ఫెక్ట్. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్‌కు డార్లింగ్. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. ఇక ఇటీవ‌ల సాహో అంటూ వ‌చ్చిన టాలీవుడ్ రారాజు ప్ర‌భాస్ రాజు. ఇలా విజ‌యాలు త‌న ఖాతాలో వేసుకుని ఎక్క‌డా లేని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడీయ‌న‌.

 

అలాగే అమ్మాయిలకు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ సినిమా ఏదైన విడుదల అయితే చాలు.. థియేటర్ల క్యూలైన్లలో అబ్బాయిలతో సమానంగా ఉంటారు. ప్రభాస్‌ అంటే అమ్మాయిలకు అంత పిచ్చ‌ని చెప్పాలి. ఇక పెళ్లైన ఆడ‌వాళ్లు కూడా ప్ర‌భాస్ అని చెప్ప‌డం విశేషం. తెలుగు మ‌హిళా ప్రేక్ష‌క మ‌న‌సు దోచిన ముద్దుల డార్టింగ్ ప్ర‌భాస్ క్రేజ్ అంతా ఇందా కాదు. అభిమానులు, ప్రేక్ష‌కులే కాదు.. సినీ హీరోలు, హీరోయిన్లు కూడా ప్ర‌భాస్‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. 

 

ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ...2004లో చేసిన ‘వర్షం’ చిత్రం ప్రభాస్ సినీకెరీర్‌ను మలుపు తిప్పింది. హీరోగా ప్రభాస్‌కు మూడో సినిమా. ఈ మూవీతో ప్రభాస్ తన కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘అడవిరాముడు’, ‘చక్రం’ లాంటి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ‘చక్రం’ మూవీతో డిఫరెంట్ మూవీస్ చేయగలడు ప్రూవ్ చేసుకున్నాడు. ఇలా ఒక్కో చిత్రంలో ఒక్కోలా త‌న నటనతో  ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న ఈ హీరో.. తన వ్యక్తిత్వంతో వాళ్లని డైహార్డ్‌ ఫ్యాన్స్ గా మార్చేసుకున్నాడు. కాస్త సిగ్గు, ఇంకాస్త బిడియం, కొండంత వినయం.. ఇవన్నీ ఆయనలో కనిపిస్తుంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: