రాజకీయాల కోసం సినిమాలు వదులుకున్న పవన్ కళ్యాణ్ తిరిగి యూటర్న్ తీసుకుని ఇప్పుడు సినిమాలలో నటిస్తున్న పరిస్థితులలో పవన్ కళ్యాణ్ తీసుకునే పారితోషికం పై ఇప్పటికే చాల ఊహాగానాలు వచ్చాయి. ‘పింక్’ రీమేక్ లో నటిస్తున్నందుకు పవన్ కు 50 కోట్ల పారితోషికం లభించబోతోంది అంటూ ప్రచారం కూడ జరిగింది. 

ఇలాంటి పరిస్థితులలో ‘పింక్’ రీమేక్ ను నిర్మిస్తున్న దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా మొదలు అయిన తరువాత బేరసారాలు ఆడుతున్నాడు అంటూ గాసిప్పులు మొదలయ్యాయి. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు 35 రోజులు పరిస్థుతులలో రోజుకు ఒక కోటి చొప్పున లెక్క వేసి 35 కోట్ల పారితోషికం దిల్ రాజ్ పవన్ కు ఆఫర్ చేసినట్లు టాక్. 

ఈ విధంగా దిల్ రాజ్ బేరసారాలు ఆడడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. మొదట్లో ‘పింక్’ రీమేక్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు రాస్తాడని దిల్ భావించాడట. అయితే త్రివిక్రమ్ ఈ బాధ్యతను తీసుకోక పోవడంతో ఇప్పుడు ఈ బాధ్యతను అంతా దర్శకుడు వేణు శ్రీరామ్ మోస్తున్నాడు.

త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ లో లేడు అన్న విషయం బయటకు పొక్కడంతో ఈ మూవీకి భారీ స్థాయిలో బయ్యర్ల నుండి ఆఫర్స్ రావని అదేవిధంగా ఇప్పటికే ఈ మూవీ హిందీ తమిళ భాషలలో విడుదలైన పరిస్థితులలో ఈ మూవీకి డబ్బింగ్ రైట్స్ కు సంబంధించి పెద్దగా బిజినెస్ ఉండదని దిల్ రాజ్ వాదిస్తున్నట్లు టాక్. దీనికితోడు ‘సాహో’ ‘సైరా’ ల సినిమాలతో దెబ్బతిన్న అమెజాన్ సంస్థ నుండి కూడ భారీ ఆఫర్స్ రాని పరిస్థితులలో పవన్ పారితోషికాన్ని 50 నుండి 35 కోట్లు తీసుకోమని దిల్ రాజ్ లేటెస్ట్ గా చేస్తున్న రాయబారాలు పవన్ కళ్యాణ్ కు మైండ్ బ్లాంక్ చేస్తున్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: