మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజ చిత్రం బాక్సఫీసు వద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో రవితేజ ఎనర్జీ ఎక్కడా కనబడలేదనే టాక్ వినిపించింది. సైన్స్ ఫిక్షన్ మూవీగా స్టార్ట్ అయిన చిత్రం చివరి వరకు వచ్చేసరికి ఒక రెగ్యులర్ మాస్ మూవీగా మారడం కూడా మైనస్ గా మారింది. రవితేజని కొత్తగా చూద్దామనుకున్న వారికి తీవ్ర నిరాశకి గురి చేసింది. అయితే ఈ సినిమా అనంతరం రవితేజ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

 

గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో గోపి చంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలు సాధారణ కమర్షియల్ చిత్ర్రాలైనప్పటికీ... బ్లాక్ బస్టర్ అయ్యాయి. అయితే మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తున్నందున హిట్ పడుతుందని అనుకుంటున్నారు.

 

 

అయితే డిస్కో రాజా సినిమా ద్వారా రవితేజ కెరీర్లో వరుసగా నాలుగవ ఫ్లాప్ వచ్చి చేరింది. అదీ కాకుండా రవితేజ మార్కెట్ కూడా చాలా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో క్రాక్ సినిమా మీద ఎక్కువ అంచనాలు పెట్టుకోవట్లేదు. రవితేజకి గోపీచంద్ సినిమా ద్వారానే మాస్ మహారాజ్ అనే ట్యాగ్ వచ్చిందని అందరికీ తెలిసిందే.. మరి ఆ ట్యాగ్ కి తగ్గట్టు క్రాక్ సినిమా ఉంటుందా.. ఉండదా అన్నది ప్రశ్న...

 

 

రవితేజ మాత్రం ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతోనైనా మళ్ళీ ట్రాక్ లో పడతాడని అతని అభిమానులు ఆశిస్తున్నారు. మరి వారు ఆశించినట్టుగా క్రాక్ తో రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడా లేదా అనేది చూడాలి. సినిమా పేరును బట్టి చూస్తే కిక్ సినిమాలా ఉంటుందేమో అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: