టాలీవుడ్ హాస్య బ్రహ్మ జంద్యాల సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది.  ఆయన సినిమాలంటే సంపూర్ణమైన హాస్యంతో పాటు ఏదో ఒక మెసేజ్ కూడా ఉంటుంది.  ఆయన ఎంతో మంది టాప్ హాస్య నటులను సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో హాస్యానికే వన్నె తెచ్చిన హాస్య బ్రహ్మ బ్రంహ్మానందం.  కేవలం తన హావభావాలతో థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు.  అయితే జంద్యాల తర్వాత ఆ తరహా కామెడీతో నవ్వించిన దర్శకుల్లో ఒకరు రేలంగి నరసింహారావు. ఫ్యామిలీ ఎమోషన్స్ ను కామెడీతో కలిపి నడిపించే దర్శకుడిగా రేలంగి నరసింహారావుకి మంచి పేరు వుంది.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జంద్యాల గురించి ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   జంధ్యాలగారి మాదిరిగానే నేను కూడా హాస్యభరిత సినిమాలు ఎక్కువగా తెరకెక్కించాను. అయితే జంధ్యాలగారి సినిమాలకి .. నా సినిమాలకి మధ్య తేడా వుంది. ఆయన సినిమాలు ప్రేమికులపై ఎక్కువగా ఉంటాయి. నా సినిమాలు భార్యాభర్తల బంధంపై ఉంటాయి. జంద్యాల సినిమాల్లో కామెడీ చాలా నేచురల్ గా మన మద్య సంభాషనలు ఎలా ఉంటాయో వాటిని కామెడీ రూపంలో మరల్చేవారు.  అందుకే ఆయన కామెడీ అంటే తెలుగు ప్రేక్షకులకు వల్లమాలిన అభిమానం.  ఇప్పటికీ ఆయన కామెడీ సీన్లు బుల్లితెరపై చూసి నవ్వుకుంటాం. 

 

అయితే   నా సినిమాల టైటిల్స్ లోనే అది భార్యాభర్తల కథ అని తెలిసిపోతుంది. 'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు' .. 'ఎదురింటిమొగుడు పక్కింటి పెళ్లాం' .. 'పోలీస్ భార్య' .. 'పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ' ..' నేను మా ఆవిడ'.. 'ఏవండోయ్ శ్రీమతిగారు' ఇలా వుండేవి.  అయితే అందులో కామెడీ ఎంత ఉన్నా జంద్యాల తో పోల్చుకోలేనివి అని చెప్పొచ్చు. నా సినిమాలు సైతం ఫ్యామిలీతో కలిసి చూడదగినవిగా   ఉండేవి. ఇప్పుడు అలాంటి సినిమాలు తక్కువగా వస్తున్నాయి  అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: