టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తీసే సినిమాలు ఎమోషన్ కామెడీ నీ తో పాటు మంచి పాటలు ఫైట్స్ ఉంటాయి. మాటల రచయిత గా కెరీర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు టాలీవుడ్ కి అందించారు. ఆయన దర్శకత్వంలో ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు , అల్లు అర్జున్ , ఎన్టీఆర్ లాంటి అగ్రహీరోలు నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురం లో మూవీతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ అందించారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో ఓ మూవీ కమిట్ అయిన విషయం తెలిసిందే.

 

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అరవింద సమేత మంచి హిట్ సినిమా వచ్చింది.  వీరిద్దరు మూవీ ఆగష్టులో సెట్స్ పైకి వెళుతున్నట్టు సమాచారం.  టైటిల్ కూడా వ్వ్ చాలా వెరైటీగా ‘అయినను పోయి రావాలి హస్తినకు’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ లో టాక్. అయితే ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో ఉండబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో లో సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న విషయం తెలిసిందే.

 

ఈ సమయంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి త్రివిక్రం ఏ మాయ చేస్తారు అని ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన విషయం తెలిసిందే. మరి ఈసారి ఎన్టీఆర్ ని ఏ యాంగిల్ లో చూపిస్తాడో నందమూరి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ కూడా మరో బాక్సాఫీస్ హిట్ అవుతుందా లేదా చూడాలి. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: