ప్రభాస్... టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఈ హీరోకు ఉన్న డిమాండ్, గుర్తింపు అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో రెమ్యూనరేషన్ పరంగా క్రేజ్ పరంగా ప్రభాస్ టాప్ పొజిషన్ లో ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ గత కొన్ని సంవత్సరాల నుండి ఇప్పటికే ఉన్న రికార్డులను తిరగరాస్తూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ప్రభాస్ సరికొత్త కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేశాడు. 
 
ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డులు తిరగరాయటం ఇప్పట్లో సాధ్యం కాదని ఇతర స్టార్ హీరోలు కూడా తమ సినిమా కలెక్షన్ల పోస్టర్లపై నాన్ బాహుబలి రికార్డులు అని వేసుకుంటూ ఉండటం గమనార్హం. గతంలో కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర భాషల్లో తమ సినిమాలను విడుదల చేసి అక్కడ కూడా మార్కెట్ సంపాదించుకుందామని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ హీరోలు చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. 
 
కానీ ప్రభాస్ కు బాహుబలి సిరీస్ సినిమాలతో బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో గుర్తింపు వచ్చింది. సాహో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా బాలీవుడ్ లో నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాతో కూడ 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించిన అరుదైన రికార్డు కేవలం ప్రభాస్ కు మాత్రమే సొంతమని చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సిరీస్ సినిమాలు అవార్డుల విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. 
 
వరుస విజయాలతో ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోలందరిలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ను అందుకుంటుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు గుర్తింపు ఉండటంతో నిర్మాతలు కూడా ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా ఇవ్వడానికి వెనుకాడటం లేదు. వరుస విజయాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: