టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే వెంటనే చెబుతారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా, నితిన్.  అయితే ఈ మధ్య నితిన్ కి పెళ్లి సెటిల్ అయ్యింది అని త్వరలో  పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక రానా విషయానికొస్తే పెళ్లి ఊసేలేదు ప్రస్తుతం సినిమాల పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అయితే  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం మాత్రం ప్రతి సంవత్సరం హాట్ టాపిక్ గా మారుతుంది. వాస్తవానికి ఆరేళ్ల క్రితం బాహుబలి మొదలుపెట్టినప్పుడు ఆయన పెళ్లి ప్రస్తావన వచ్చింది.  ఓ ఇంజనీర్ అమ్మాయితో ప్రభాస్ కి నిశ్చితార్థం జరిగిందని వారి చుట్టాల అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ  ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అవన్నీ రూమర్లు అని కొట్టిపడేశారు.

 

అదే సమయంలో ప్రభాస్ బాహుబలి పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాడని చెప్పారు. అయితే  ప్రభాస్ మాత్రం బాహుబలి 2 మూవీ కంప్లీట్ అయ్యేవరకు పూర్తిగా తన డెడికేషన్ మొత్తం ఈ సినిమాపైనే పెట్టారు.  బాహుబలి, బాహుబలి 2 సినిమాలకు ఏకంగా ఐదు సంవత్సరాలు పట్టింది.  పెళ్లి కాదనుకున్నా జాతీయస్థాయిలో మంచి నటుడిగా మాత్రం గుర్తింపు తెచ్చుకున్నాడు.  అయితే ప్రతి ఏడాది పెళ్లి ప్రస్తావన మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది. ఈసారి ప్రభాస్ పెళ్లి విషయంలో ఆయన పెద్దమ్మ అ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నారు.

 

మరి ఈసారి   ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి విషయాన్ని ఖరారు చేస్తారా లేదా అన్న విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఓ వైపు తన తోటి హీరోలకు పెళ్లిళ్లు కావడం పిల్లలు కూడా పుట్టడం జరిగింది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ లో ప్రభాస్ లు తమ పెళ్లి విషయం ఎప్పుడు ఖరారు చేస్తారు అన్న విషయం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.  ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఏవైనా కొత్త విషయాలు తెలుస్తాయని ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: