ప్రభాస్ రాజు.. పరిచయం అక్కర్లేని  పేరు.. ప్రముఖ సీనియర్  హీరో  కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర్ తో  సినిమాల్లోకి  హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కు వర్షం బ్రేక్ ఇవ్వగా రాజమౌళి ,అతన్ని  స్టార్ ను  చేశాడు. వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి  సెన్సషనల్  హిట్ కావడంతో అప్పటినుండి ప్రభాస్ వెను దిరిగి చూసుకోలేదు. అయితే ఈ సినిమా తరువాత ఎన్ని ప్లాప్ లు  వచ్చిన  ప్రభాస్  క్రేజ్ మాత్రం తగ్గలేదు. మధ్యలో  డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి  కూల్ హిట్స్  తరువాత మిర్చి తో  మళ్ళీ తన  విశ్వరూపం చూపించాడు. 
 
ఇక ఈ సినిమా  తరువాత  నటించిన  బాహుబలి ,బాహుబలి 2 సినిమాలు ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్  ను చేశాయి.  ఈ సినిమాలతో  ప్రభాస్ రేంజ్ అమాంతంగా  పెరిగిపోయింది. ఎక్కడిదాకంటే ప్రభాస్ మైనపు విగ్రహాన్ని టుస్సాడ్ మ్యూజియం లో పెట్టేదాకా.  సౌత్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత ఈ గౌరవం దక్కించుకున్న  హీరో కూడా ప్రభాసే కావడం విశేషం. ఈఒక్క  సిరీస్ తో ప్రభాస్  జపాన్ లోకూడా అభిమానులు సంపాదించుకున్నాడు. ఇక  బాలీవుడ్ లో  అయితే చెప్పనక్కర్లేదు. దాదాపు తెలుగు లో ఎంత  ఫాలోయింగ్ వుందో  ఇప్పుడు హిందీ లో కూడా  అంతే  పాపులారిటీ కలిగివున్నాడు. అక్కడ  ఖాన్ లకే సవాలు విసురుతున్నాడు. 
 
బాహుబలి  2తరువాత రెండుళ్లు గ్యాప్ తీసుకొని గతఏడాది  సాహో తోప్రేక్షకులముందుకు వచ్చాడు ప్రభాస్.  అయితే ఈ సినిమాలో కథ లేకపోవడంతో మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచుకున్నా  కూడా ఫుల్ రన్ లో  ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో  సినిమాలో తనుంటే చాలు  కథ అవసరం లేదని  నిరూపించాడు ప్రభాస్. సాహు హిందీ వెర్షన్ అయితే 150కోట్లను కలెక్ట్ చేసి  సూపర్ హిట్ అనిపించుకుంది. అలా ప్రభాస్ ప్రస్తుతం ఇండియా లోనే  భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏకైక  తెలుగు హీరోగా  కొనసాగుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: