వరుస విజయాలతో జోరు మీదున్న నాని, పస్తుతం ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "వి" అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కింది.  గ్యాంగ్ లీడర్ తో యావరేజ్ హిట్ అందుకున్న నాని మరోసారి హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. మిడ్ రేంజ్ హీరోలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. వరుస విజయాలతో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. 

 

 

ప్తస్తుతం "వి" సినిమా షూటింగ్ చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. అయితే నిన్న సుధీర్ బాబు లుక్ రివీల్ చేసింది చిత్ర బృందం. రక్షకుడు అనే పేరుతో రివీల్ చేసిన ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంతే ఈ రోజు నాని లుక్ ని కూడా రివీల్ చేశారు. రాక్షసుడి గా నాని లుక్ చాలా ఇంటెన్సివ గా ఉంది. ఫస్ట్ లుక్ లో నాని ఫుల్ గడ్డంతో రఫ్ లుక్ లో.. చేతిలో కత్తెర అలాగే చేయి మీద నుండి కారుతున్న బ్లడ్ తో మొత్తానికి ఈ యాక్షన్ లుక్ తో నాని బాగా ఆకట్టుకున్నాడు.

 

 

మొత్తానికి ఈ లుక్ సినిమా పై ఉత్సుకతను మరింత పెంచింది. తన తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో చూపించబోతున్నాడని అర్థం అవుతోంది. ఇద్దరు హీరోలు నటిస్తున్న ఈ చిత్రంలో ఒకరు రక్షకుడిగా ఉండగా, మరొకరు రాక్షసుడిగా కనిపిస్తున్నారు. నాని ఇప్పటి వరకు నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయలేదు.

 

 

దాంతో ఈ సినిమాలో నాని పాత్ర మీద ఆసక్తి మరింత పెరిగింది.  నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. నాని న‌టిస్తోన్న‌ 25వ చిత్ర‌మిది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి25న విడుద‌ల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: