'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 15ఏళ్ల భారీ గ్యాప్ తర్వాత ప్రొఫెసర్ భారతి పాత్రలో దేశం కోసం వారసుల్ని త్యాగం చేసిన మాతృమూర్తిగా నటించారు. విజయశాంతికి పర్ పెక్ట్ కంబ్యాక్ మూవీ అనే చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యకరం యాదృచ్చికం. ఇక సినిమా ఎలా ఉన్నప్పటికి లేడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సంబరపడ్డారని చెప్పాలి. భారతి పాత్రకు విజయశాంతి తప్ప మరొకరు న్యాయం చేయలేరు అన్నవిధంగా విమర్శకుల ప్రశంసలు కురిశాయి. దర్శకుడు అనీల్ రావిపూడి విజయశాంతి వెంటపడి మరీ ఒప్పించినందుకు గాను మంచి ఫలితమే తక్కింది. ఇప్పటి నుంచి విజయశాంతి పొలిటికల్ గాను, లేడీ బాస్ గా సినిమాల్లోను కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

అయితే కంబ్యాక్ మూవీ కావడంతో విజయశాంతి కి సరిలేరు టీమ్ భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వడం తో పాటు ఇతరత్రా సౌకర్యాలు కల్పించారు. కాలు కింద పెట్టకుండా రాములమ్మలా చూసుకున్నారట అనీల్ రావిపూడి టీమ్. సకల సౌకర్యాల్ని తనకోసం ఆన్ లొకేషన్ కే అందుబాటులోకి తెచ్చారని చెప్పుకున్న విషయమూ తెలిసిందే. దాదాపు 2కోట్ల రెమ్యూనరేషన్ కూడా నిర్మాతలు ఇచ్చుకున్నారట. అయితే ఇప్పుడు అదే ఫార్ములాని మిగతా మేకర్స్ దగ్గరా ఉపయోగిస్తున్నారట విజయశాంతి. ఇప్పటి నుంచి కమిటయ్యో సినిమాలకి సరిలేరు రేంజ్ ట్రీట్ మెంట్ కావాలని కండీషన్లు పెడుతున్నారట. ఏ సినిమాకు సంతకం చేసిన తన పాత్ర కు ఎక్కువ ప్రాముఖ్యత ఉండాలని,   ప్రచారంలో తానే హైలైట్ కావాలని మరో కండిషన్ పెడుతూ ముందే చెబుతున్నారట.

 

అంతేకాదు రెమ్యూనరేషన్ విషయంలోను అసలు కాంప్రమైజ్ కావడం లేదని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోది. 2 కోట్లు రెమ్యూనరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టు పట్టి ఉన్నారట. మరి రాములమ్మ కండీషన్ల కు దర్శక, రచయితలు తమ పరిధిలో తనకోసం మంచి పాత్ను క్రియేట్ చేయొచ్చు కానీ.. రెమ్యూనరేషన్ తో పాటు ఇతర సౌకర్యాల విషయంలో నిర్మాతలే స్టెప్ తీసుకోవాలి కదా అని అంటున్నారు. అంతేకదా దర్శక రచయితలు క్యారెక్టర్ లో ఇంపార్టెన్స్ ఉండేలా చూడగలరుగాని రెమ్యూనరేషన్ ఎంత అని డిసైడ్ చేయలేరుగా. 

మరింత సమాచారం తెలుసుకోండి: