రాఘవేంద్ర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును అందుకుంటూ వస్తున్నారు. తన హైట్, పార్శనాలిటీకి పడిపోని అమ్మాయి ఉండదు. వయసు అయిపోతున్న పెళ్లి చేసుకొని ప్రభాస్ కోసం చాలా మంది అమ్మాయిలు వరుసలో క్యూ కడుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా సినిమాలల్లో నటించిన ప్రభాస్ విభిన్న పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నారు. 

 

అయితే, బాహుబలి సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ స్థాయి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది...సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నాడు.. అందుకే ఫాన్ ఇండియా హీరోగా కూడా కొత్త అవతారం ఎత్తారు.. అది ప్రభాస్ మార్కెట్..ఇక ఈయన సాహొ సినిమా గట్టి దెబ్బ వేయడంతో కాస్త టైమ్ తీసుకొని మరి ఓ సినిమాలో నటిస్తున్నారు..గతం యాక్షన్ కోణంలో వచ్చిన సినిమాల్నీ భారీ డిజాస్టర్ గా మారిన కూడా ఇప్పుడు మొన్న వచ్చిన సినిమా కూడా ఫ్లాప్ ను చవిచూసింది..

 


ఈ మేరకు ఆయన కాస్త రొమాంటిక్ టచ్ ఇవ్వాలని రెడీ అవుతున్నాడు.. ఈ నేపథ్యంలో ఓ సినిమాకు సైన్ కూడా చేశాడు..ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే, ప్రభాస్ ను రొమాంటిక్ యాంగ్లో చూడాలని చాలా అనుకోవడం విశేషమని చెప్పాలి. 

 


ఇకపోతే ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పాకిన సంగతి తెలిసిందే. అయితే మొదట చిన్న హీరోగా మొదలైన ప్రభాస్ ప్రయాణం ప్రపంచ వ్యాప్తంగా పాకింది అంటే మామూలు మాటలు కాదు. సినిమా స్థాయి పెరగడం కన్నా, డబ్బులు వచ్చాయా లేదా అని అనుకోవడం కన్నా గొప్ప పేరును సినీ అభిమానుల్లో ఒక స్థానాన్ని సంపాదించుకోవడం అనేది గొప్ప విషయమని చెప్పాలి. అయితే ఇటువంటి అరుదైన ఘనత ఏ హీరోకు దక్కకపోవడం నిజంగానే గ్రేట్ అని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: