గత కొంతకాలంగా మా అసోసియేషన్ లో జరుగుతున్న గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఒకప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు అన్న విషయం చాలా గుట్టుచప్పుడుగా ఉండేది.  కానీ ఈ మధ్య మా అసోసియేషన్ లో జరుగుతున్న గొడవలు రాజకీయాల్లో కూడా అంతగా లేవు.  అధ్యక్ష పీఠం ఎక్కేందుకు ఒకరినొకరు మీడియా సాక్షిగానే దూషించు కుంటున్నారు. గత ఏడాది మా ఎన్నికల సందర్భంగా గా శివాజీ రాజా పై ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఎన్ని ఆరోపణలు చేశారు తెలిసింది.  దానికి కౌంటర్ గా శివాజీ రాజా కూడా నరేష్ పై పలు ఆరోపణలు చేశారు. ఇలా ఉంటే నిధులు దుర్వినియోగం చేస్తున్నారని నరేష్ పై మా సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

 

మా అభివృద్ధి కి నరేష్ అడ్డంకిగా మారుతుందని ఈసీ మెంబర్ ను ఆరోపిస్తున్నారు. నిధుల దుర్వినియోగం తోపాటు ఈసీ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అవమాన పరుస్తున్నారు అని రా సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇక మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో భాషల్లో సభ్యుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయని చెప్పకనే చెప్పారు.  గత కొద్దికాలంగా మా అసోసియేషన్ లో అధ్యక్షుడు నరేష్ ఉపాధ్యక్షుడు కార్యదర్శి రాజశేఖర్ జీవితాల మధ్య వివాదం చెలరేగింది. అది రోజురోజుకీ అగ్గి రాజుకుంటోంది ఉంది.  

 

ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా పై నరేష్ కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారని ఈసీ మెంబర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరేష్ లోపాలను తప్పుబడుతూ క్రమశిక్షణ సంఘానికి లేఖ రాశామని కమిటీ సభ్యులు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేష్ పై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.  నరేష్ తన నిర్ణయాలతో ‘మా’ ను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని జీవిత రాజశేఖర్ అన్నారు. టాలీవుడ్ లో ఎవరికైనా ఇబ్బంది కలిగితే కనీసం వారిని పరామర్శించడానికి కూడా వెళ్లే లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ గొడవ ఎంతవరకు సాగుతుందో అని టాలీవుడ్ లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: