20 ఏళ్ల కిందట ఎన్ని ఫ్యాక్షన్ సినిమాలు వచ్చాయో తెలిసిందే. అప్పట్లో ఫ్యాక్షన్ సినిమాలు దుమ్ము దులిపాయి. రాయాలసీమ అంటే రక్తపాతం ఏమో అన్నట్టు సృష్టించాయి. అప్పట్లో అబ్బో.. చిరంజీవి ఇంద్ర సినిమా ఒకటి అయితే.. బాలకృష్ణ సినిమాలు మాత్రం బోలెడు.. ఎన్నో సినిమాలు తీసాడు బాలయ్య. 

 

అప్పట్లో దాదాపు 10 సంవత్సరాలు ఫ్యాక్షనిజం సినిమాలే తీసాడు. మీసం తిప్పాలన్న, కత్తి పెట్టాలన్న, తొడ కొట్టాలన్న, బాంబులు పెట్టాలన్న రాయలసీమకు మాత్రమే సొంతం అన్నట్టు చూపించారు అప్పుడు దర్శకులు.. రచయతలు ఆలా రాస్తే వాళ్ళైనా ఎం చేస్తారు లెండి.. అయితే రాయలసీమ అంటేనే ఫ్యాక్షనిజం అని చెప్పారు. 

 

ఇంకా రామగోపాల్ వంటి దర్శకులు అయితే రాయలసీమలో, విజయవాడలో పుట్టిన వారిపై బయోపిక్ లు కూడా తీస్తుంటారు. అలాంటి సీమా రాజకీయాలు తీశారు. అయితే అప్పట్లో బాలయ్య ఎన్ని సినిమాలు ఫ్యాక్షనిజంపై తీసాడో అయన లెక్క పెట్టలేడు.. అన్ని సినిమాలు తీశాడు. అందుకే బాలయ్యకు చాలామంది అభిమానులు రాయలసీమ నుండే ఉన్నారు. 

 

అయితే ఇప్పుడు ఇవి అన్ని ఎందుకు అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్న.. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి ఫ్యాక్షన్ సినిమాలు ఎలా పుట్టాయి? అన్న దానిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఫ్యాక్షన్ సినిమాలకు అసలు కారకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని. 

 

అతని వల్లే రాయలసీమ ఫ్యాక్షనిజం పతాక స్థాయికి చేరుకుందని ఆరోపించారు. బాలయ్య బాబు ఫ్యాక్షన్ పాత్రలో ఒదిగిపోవడానికి తమ వియ్యంకుడి గైడెన్స్ కూడా ఓ కారణం అంటూ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసారు. రచయితలు.. దర్శకుల క్రియేటివిటీ వల్ల సీమ రక్తపాతం కాలేదని.. చంద్రబాబు వల్లే సీమ రక్తపాతం అయిందని.. అలాంటి కథలకు ఆద్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు కరుణాకర్ రెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: