మాలో మరోసారి బాంబు పేలింది. విబేధాలు మరోసారి రచ్చకెక్కుతున్నాయి. మా అధ్యక్షుడు నరేశ్ పై పీకల్లోతు అసంతృప్తితో ఉన్న సభ్యులు కొందరు అతనిపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారట. న‌రేష్ యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.. అని మా ఎన్నిక‌ల సంఘం వాళ్లు ఈ లేఖ రాసిన‌ట్టు స‌మాచారం. దీంతో అతని భవతవ్యంపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఈ సమస్యపై చిరంజీవి లాంటి వాళ్లు కూర్చుని మాట్లాడినా స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ు.

 

ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు న‌రేష్‌ను త‌ప్పిస్తార‌ని జోరుగా ప్రచారం గుప్పుమంటోంది.

ఇప్పుడు మా నుంచి నరేశ్ ను పంపించేందుకు ఎవరు కారణమన్న విశ్లేణలు కూడా జోరందుకున్నాయి. అధ్యక్షుడు నరేశ్ కూ... ఉపాధ్యక్షురాలు జీవితకూ విబేధాలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే. అసలు ఏ కార్యక్రమానికి కూడా తనను సంప్రదించడం లేదని జీవిత ఇప్పటికే నరేశ్ పై కోపంగా ఉంది. ఈ విషయం మొన్న క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బహిరంగంగానే వెల్లడైంది.

 

మొదట్లో అందరి ముందు విబేధాలు బయటపెట్టినందుకు హీరో రాజశేఖర్ పై అంతా ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఆయన లేవనెత్తిన అంశాలపై మాత్రం టాలీవుడ్ లో బాగానే చర్చ జరిగిందట. ఉపాధ్యక్షురాలైన జీవిత కూడా కేవలం వాట్సప్ లో సమాచారం పంపించి చేతులు దులుపుకోవడం.. అందరినీ కలుపుకోకపోవడం వంటి మైనస్ పాయింట్లు నరేశ్ నుంచి ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

 

అంతే కాదు.. తాను పెద్దగా యాక్టివ్ గా లేనని ఆయనే స్వయంగా చెబుతున్నాడు కూడా. మరి అంత ఇంట్రస్ట్ లేని వారికి అధ్యక్ష పదవి ఎందుకన్న వాదన మాలో మొదలైంది. దీనికితోడు మిగిలిన కారణాలు కూడా తోడై మొత్తానికి మా అధ్యక్ష పదవి నుంచి నరేశ్ ను దింపడం దాదాపు ఖాయమైపోయిందని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: