యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజు.. ఎందరో అమ్మాయిల మనసును దోచుకున్న డార్లింగ్.. మిర్చి మిర్చి అంటూ అందరి మనసు గెలుచుకున్న వ్యక్తి ప్రభాస్ అలాంటి ప్రభాస్ పెళ్లి ఒక సంచలనం అయిపోయింది. ముసలోడివి అయ్యావు అయ్యా బాబు.. తొందరగా పెళ్లి చేసుకో అన్న చేసుకోడే.. ఇప్పటికి ఎంత మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు.. 

 

అసలు ప్రభాస్ కు 16ఏళ్ళ క్రితమే పెళ్లి అవ్వాల్సింది.. కానీ తప్పించుకున్నాడు. అది ఎలా అనుకుంటున్నారా? అదేనండి.. అప్పట్లోనే ప్రభాస్ ఓ భామతో పీకల్లోతుల్లో ప్రేమలో ఉన్నాడు అని అందరూ అనుకున్నారు.. కానీ ప్రభాస్ ఏమి లేదు కొట్టేపారేశాడు.. ఆమె ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు అండి.. త్రిష. 

 

ప్రభాస్ కు త్రిషతో నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటి అంటే.. ఒకటి పౌర్ణమి.. రెండోది వర్షం. ఆ సినిమాలో వీరి నటన చూస్తే నిజంగానే ప్రేమలో ఉన్నారు ఏమో అనుకోవాలి. ఇంకా ఆలా త్రిష ప్రేమ బయటకు రాకుండానే అంతం అయ్యింది. ఆ తర్వాత.. అనుష్క.. 

 

అదేంటో కానీ.. జనాలకు అనుష్కతో ప్రభాస్ అంటే చాలు.. పెళ్లి ఎప్పుడు అని అడిగేస్తారు.. ఎంత వారు అంటే అభిమానం ఉంటె మాత్రం మరి అంత  పిచ్చి ఉండాలా ? దానికి కారణం ఒకింత సోషల్ మీడియానే.. మిర్చి సినిమాలో వీరి పెయిర్ చూసి అభిమానులు వారి జంటకు ఫిదా అయ్యారు .. ఆ తర్వాత ప్రభాస్ అనుష్క బాహుబలిలో నటించడం.. ప్రేమలో పడ్డారు అని వార్తలు రావడం ఒక రకంగా సంచలనం సృష్టించాయి. 

 

ఇంకా ప్రభాస్ అనుష్కని కూడా చేసుకోవడం లేదు అని తేలిపోయింది. దీంతో అభిమానులు అంత ఇంకా ఎవరిని చేసుకంటాడు అని వెయిట్ చేస్తున్నారు. అయినా పెళ్లి అంటే చాలు అదిగో ఇదిగో అని మాట దాటేస్తాడు ప్రభాస్ బాబు.. అందుకే అభిమానులు అంత కూడా అడుగుతుంటారు.. పెళ్లి ఎప్పుడు రాజా... ఇంకెన్నాళ్లు మాకీ ఎదురు చూపులు అని. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడో దేవుడే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: