నితిన్ గత సంవత్సరం అసలు కలిసి రాలేదని చెప్పాలి. చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ గా మిలాయి. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. 2020 లో మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఇంతలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడు. ఇక తాజా చిత్రం భీష్మలో నితిన్ - రష్మిక కలిసి రొమాన్స్ చేయబోతున్నాడు. భీష్మ సినిమా నుండి వస్తున్న పోస్టర్స్ చూస్తుంటే ఫ్యాన్స్ కి కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు యూత్ కి కావలసిన ఘాటు రొమాన్స్ కూడా ఉండబోతోందని అర్థమవుతోంది. ముఖ్యంగా అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేస్తారని నితిన్ హ్యాండ్సం ఫొటోస్ చూస్తే తెలుస్తోంది. 

 

అందులో భాగంగా ఈ సినిమా నుండి తాజాగా మరో కొత్త పోస్టర్ రిలీజైంది. ఈసారి పోస్టర్ లో నితిన్ - రష్మిక జంట రొమాన్స్ పీక్స్ కి చేరుకుందని అర్థమవుతోంది. భీష్మ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ రష్మిక సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది. అల్ట్రా మొడ్రన్ డ్రస్ చూస్తే యూత్ పిచ్చెక్కి పోస్టర్ నే పదే పదే చూస్తూ ఉండిపోతారనిపిస్తుంది. మంచి రొమాంటిక్ కపుల్ అని నెటిజెన్స్ తెగ ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పోస్టర్ లో నితిన్-రష్మిక లను చూసి తమని తాము ఊహించుకుంటున్నారట.

 

ఇప్పటివరకూ వచ్చిన పోస్టర్లు.. టీజర్ భీష్మ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా భీష్మ పాటల ప్రమోషన్ మొదలైంది. తొలి సింగిల్ వాటే బ్యూటీ అనే సాంగ్.. ఈనెల 31న రిలీజ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ జెట్ స్పీడ్ తో యూత్ లో బాగా వైరల్ అయిపోతోంది. ఇంతకుముందు రిలీజైన సింగిల్స్ ఆంథెమ్ కి అద్భుత స్పందన వచ్చింది. ఇప్పుడు వాటే బ్యూటీ అంటూ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 21న సినిమా రిలీజయ్యే వరకూ వరుసగా ఈ సినిమా పాటల ట్రీట్ ఉంటుందని తెలుస్తోంది. యూత్ స్టార్ నితిన్- రష్మిక మందన జంటగా 'ఛలో' ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న సినిమా కాబట్టి బాగా హైప్ క్రియోట్ అయింది. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: