అసలు ఈ సినిమా వాళ్లూ సినిమా చూసే ప్రేక్షకుల గురించి ఏమనుకుంటారో అనే సందేహం ఎవరికైనా ఇప్పటి వరకు కలిగిందా.. కలుగదు. ఎందుకంటే అభిమాన హీరోను పెట్టి అందులో, కొంత మసాలలు జోడించి, పాచిపోయిన అన్నాన్ని తాళింపు వేస్తే ఎలా ఉంటుందో ఇలాంటి కధలతో సినిమా చుసిన ప్రేక్షకుడు ఏమనుకుంటాడో అని ఆలోచించే సమయం ఎక్కడుందంటున్నారు కొందరు ఇప్పుడు వచ్చే సినిమాలు చూసి చూసి విసిగిపోయిన వారు..

 

 

ఇలా ఎందుకు అనుకుంటున్నారని ఆరా తీస్తే. అభిమాన సంఘాలకు అనిల్ అంబాని లాంటి వారు ఏమైనా కొత్త సినిమాలు వస్తే చూడండని, డబ్బులు గాని డొనెట్ చేస్తున్నారనుకుంటున్నారా ఏంది.. లేకుంటే వింత కాకుంటే ఏంటండి. డబ్బుల చెట్లు రోడ్లమీద మొలిస్తే వాటి నుండి డబ్బులు రాల కొట్టుకుని విడుదలైన అన్ని సినిమాలు ప్రేక్షకులు చూడాలని, వాటిని వంద రోజులు ఆడించి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి, కోట్లు మాకు , కొట్లాటలు మీకు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు చూడు ఈ మధ్య సినిమా వాళ్లూ..

 

 

అరే సంక్రాంతి పండగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఐదుగురు బడా బడా హీరోల సినిమాలు రిలీజ్ చేశారు.. ఒకే సారి అన్ని సినిమాలు రిలీజ్ చేస్తే అవి చూడడానికి పైసలు యాడినుండి వస్తాయ్. సరే బాగా ఖర్చు పెట్టించి ఆ పండగ వెళ్లిపోయింది. మరి ఈ సినిమా వాళ్లూ వెనకా ముందు చూడవచ్చు కదా. అదీలేదు.. సంక్రాంతి వెళ్లి నెలరోజులు కాక ముందే..  ఫిబ్రవరి 7వ తారీఖున ఏకంగా అరడజను సినిమాలు విడుదలవబోతున్నాయి.

 

 

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా.. తమిళ నాట సంచలన విజయం సాధించిన ‘96’ సినిమాని తెలుగులో జాను అనే పేరుతో ఫిబ్రవరి 7వ తారీకున విడుదల కానుంది. ఇదేగాక ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘ సవారి’,‘ అమృతారామమ్’.. సినిమాలు విడుదల కానున్నయి. ఈ నేపథ్యంలో ఒకేసారి ఇన్ని సినిమాలు చూడాలంటే మా దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా అర్థం చేసుకోవాలి అని అంటున్నారట తెలుగు సినిమా ప్రేక్షకులు. మరి వీరి మనోగతాన్ని అర్ధం చేసుకునే వారెవరు అని అనుకుంటున్నారు  ఈ ముచ్చట విన్నవారు..

మరింత సమాచారం తెలుసుకోండి: