జబర్దస్త్ కామెడీ షో.. బుల్లితెర ప్రక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఎందరికో లైప్ ఇచ్చిన ఈ రియాలిటీ కామెడీ షో ఇంతగా సక్సెస్ అవుతుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ గా పరిచయం అయ్యారు. బాగా డబ్బులు సంపాధించుకుని సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అందులో హైపర్ ఆది కూడా ఒకడు. జబర్డస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ హైపర్ ఆది వేసే పంచులకు హద్దే ఉండదు. జబర్దస్త్ లో ఉన్నంత సేపు అతడిని పంచులతో ఎలాంటి టీమ్ అయినా వెనకడుగు వేసేది.
అందుకే ఆదిని ఏమైనా అనాలంటే ముందే రివర్స్ పంచులకు కూడా సిద్ధంగా ఉండాలి. ఈ మధ్య హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షోతో పాటు మిగిలిన కార్యక్రమాల్లో కూడా బాగానే పాల్గొంటున్నాడు. మరోవైపు సినిమాల్లో కూడా మంచి మంచి ఛాన్సులు కొట్టేస్తూ దుసుకుపోతున్నాడు. అయితే హైపర్ ఆది జబర్దస్త్‌కు రాకముందు ఏం పని చేసేవాడో తెలుసా..? తెలియకపోతే ఓ లుక్కేసేయండి. హైపర్ ఆది బి టెక్ తర్వాత కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత యూ ట్యూబ్ వీడియోలు చేసాడు.
అక్కడ్నుంచి అభి స్కిట్స్ నుంచి ఫేమ్ తెచ్చుకుని ఇప్పుడు హైపర్ ఆది అయ్యాడు. ప్రస్తుతం ఈయన ఒక్కో ఎపిసోడ్‌కి మూడు నుంచి ఐదు లక్షలు అందుకుంటున్నట్టు టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇప్పటికే సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న ఆది.. ఇప్పుడు ఏకంగా హీరో అయిపోతున్నాడు. ఈ మధ్యే యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆది అక్కడే విషయం కన్ఫర్మ్ చేసాడు. ఇప్పటికే కథలు వింటున్నానని.. తనకు డాన్సులు, ఫైట్లు అస్సలు పడవని.. పూర్తిగా కామెడీ ప్రధానంగా సాగే కథను ఎంచుకుంటానని చెప్పాడు హైపర్ ఆది.