టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తొట్టెంపూడి వేణు హీరోగా తెరకెక్కిన స్వయంవరం సినిమాతో కథ, మాటల రచయితగా తన సినీ ప్రయాణం ప్రారంభించి ఆ తరువాత పలు సినిమాలకు కథ, మాటలు అందించి తనకంటూ ఆడియన్స్ లో ఒకింత ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తరువాత తరుణ్, శ్రియల కాంబోలో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆపై సూపర్ స్టార్ మహేష్ తో అతడు సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్, అక్కడి నుండి పలువురు స్టార్ హీరోలతో పలు సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ ముందుకు సాగుతున్నారు. 

 

ఇక త్రివిక్రమ్ సినీ జీవితం గురించి తప్ప పర్సనల్ విషయాల గురించి మనలో చాలా మందికి తెలియదు. నిజానికి మాటల రచయితగా కొనసాగుతున్న సమయంలోనే త్రివిక్రమ్ కు సౌజన్య గారితో వివాహం జరిగింది. ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడి కుమార్తె సౌజన్య. అయితే ఒకానొక సందర్భంలో సౌజన్య గారి అక్కయ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో త్రివిక్రమ్ పెళ్లి వివరాలు కూడా వారి వద్దకు రావడం, అతడిని గురించి తెలిసిన సిరివెన్నెల, ఆ కుర్రాడు చాలా మంది వాడని, ఇప్పుడిప్పుడే సినిమాల్లో తన టాలెంట్ తో పైకి వస్తున్నాడని చెప్పారట. అయితే సిరివెన్నెల మాటలతో సంతృప్తి చెందిన ఇంట్లోని వారు, త్రివిక్రమ్ ని పెళ్లి చూపులకు పిలిచారట. 

 

అయితే ఎట్టకేలకు పెళ్ళిచూపులకి వచ్చిన త్రివిక్రమ్, తనకు పెద్ద అమ్మాయి కాకుండా చిన్న అమ్మాయి అయిన సౌజన్య నచ్చిందని చెప్పడంతో వారందరూ ఒకింత ఆలోచనలో పడ్డారట. అయితే చివరకు సౌజన్యను ఇచ్చి మీకు వివాహం చేయడానికి అభ్యంతరం లేదు, కాకపోతే ఒక ఏడాది సమయం పడుతుంది ఆగగలరా అని అడిగారట. అందుకు సమ్మతించిన త్రివిక్రమ్, సరిగ్గా ఏడాది తరువాత స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఎంతో వేడుకగా వివాహం చేసుకున్నారు. ఆ విధంగా అక్కను చూడడానికి వచ్చిన త్రివిక్రమ్, చెల్లెలైన సౌజన్యను వివాహమాడారన్నమాట. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, త్రివిక్రమ్ కు అత్యంత ఆప్తమిత్రుడైన సునీల్ వివాహం కూడా సరిగ్గా అదే రోజున జరిగిందట......!!

మరింత సమాచారం తెలుసుకోండి: