టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ కి ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత రూత్ ప్రభు, ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక ఆ తరువాత నుండి ఆమెకు వరుసగా అవకాశాలు రాసాగాయి. అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో దూకుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనం వంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన సమంత, అక్కడినుండి పలువురు ఇతర స్టార్ హీరోల సరసన కూడా నటించి మంచి సక్సెస్ లు అందుకుంది. ఆపై అక్కినేని వారి వారసుడు నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత, పెళ్లి తరువాత మాత్రం ఒకింత సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది. 

 

ఇక ఇటీవల యు టర్న్, ఓ బేబీ, మజిలీ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్న సమంత, ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇకపోతే పెళ్ళికి ముందు తన అందంతో కుర్రకారుని ఒక ఊపు ఊపిన సమంత, పెళ్లి తరువాత కూడా ఏ మాత్రం వన్నె తరగని అదే అందంతో కట్టిపడేస్తోంది. ఇక ఇటీవల ఆమె రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్న హాట్ ఫోటోలు నేడు బయటికొచ్చి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇక రెడ్ కలర్ డ్రెస్ లో ఎర్రటి ఎండలో నిలబడి ఉన్న సమంత అందాలు చూస్తుంటే మా మతులు పోవా అంటూ కొందరు, ఇక మరికొందరు అయితే మేము సమంతని ఇంత హాట్ గా ఎప్పుడూ చూడనే లేదు అంటూ పలువురు యువత తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఇక వెబ్ సిరీస్ తో పాటు శర్వానంద్ సరసన జాను సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న సమంత, ఆ సినిమాతో కూడా మరొక విజయాన్ని దక్కించుకుని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి మంచి సంచలన విజయాన్నిఆ అందుకున్న 96 మూవీకి అధికారిక రీమేక్ గా జాను సినిమా తెరకెక్కుతోంది. మరి ఆ సినిమా సమంతకు ఏ రేంజ్ సక్సెస్ ని అందిస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: