టాలీవుడ్ రారాజుగా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఈ రోజు పాన్ ఇండియా స్టార్ హీరో. సీనియర్ స్టార్ హీరోలకి సైతం రాని క్రేజ్ ని పాన్ ఇండియా రేంజ్ ని ఒక్క ప్రభాస్ మాత్రమే సాధించగిలిగాడు. మాస్ హీరోగా క్లాస్ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు ప్రభాస్. మిస్టర్ పర్‌ఫెక్ట్ అన్న టైటిల్ ప్రభాస్ కి పర్‌ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్ లో చేసిన సినిమాలన్ని ఒకెత్తైతే బాహుబలి ఒక్కటే ఒకెత్తు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 

ఇక ప్రభాస్సినిమా చేసినా ఆ సినిమా కథలో ఇమిడిపోతాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంలో పెదనన్న కృష్ణం రాజుని ఏమాత్రం తీసిపోలేదు. ముఖ్యంగా రౌద్రం లో పెదనాన్నే కనబడారు. ఆ విషయం ఛత్రపతి సినిమా చూస్తే బాగా అర్థమవుతుంది. ఒక్క ఛత్రపతి మాత్రమే కాదు మిర్చి, బాహుబలి సినిమాలలోను పెదనన్న లా కొన్ని సీన్స్ లో రౌద్రాన్ని బాగా పలించాడు ప్రభాస్. 

 

ఇక ప్రభాస్ కి పెదనాన్న నటించిన సినిమాలంటే చాలా ఇష్టమని చాలా సందర్భాలలో చెప్పాడు. సాధారణంగా ఎవరైనా ఆనాటి హీరోల సినిమాలలోని పాటలని రీమేక్ చేయాలనుకుంటారు. రాం చరణ్, సాయి ధరం తేజ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలోని పాటలను, మహేష్ బాబు ఇలానే కృష్ణ సినిమాలోని పాటలను రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కి మాత్రం పెదనన్న సినిమాని రీమేక్ చేయాలని ఉందని ఇదివరకే చెప్పాడు. పెదనన్న నటించిన సినిమాలన్ని బాగా ఇష్టమని కూడా తెలిపాడు. అయితే ఒకవేళ ప్రభాస్ పెదనన్న సినిమాని గనక రీమేక్ చేయాలనుకుంటే భక్త కన్నప్ప సినిమాని రీమేక్ చేస్తానని అందులో తనే హీరోగా నటిస్తానని తెలిపాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. ఎటు ప్రభాస్ పెదనాన్న సొంత నిర్మాణ సంస్థ గోపికృష్ణా మూవీస్ మళ్ళీ మొదలు పెట్టారు కాబట్టి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే ఛాన్స్ ఉందని ఆశిద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: