ఉప్పలపాటి ప్రభాస్ రాజు ..ఉప్పలపాటి ప్రభాస్ రాజు ..అలియాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. అలియాస్ డార్లింగ్ ప్రభాస్ ..అలియాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ..ఇవన్ని టాలీవుడ్ రారాజు .. ప్రభాస్ రాజు స్టామినాని తెలిపేవే. ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బారీ కటౌట్ చూసి ఏమున్నాడ్రా బాబు ఒక్కసారైనా డేటింగ్ కమిటైపోవచ్చు అని అమ్మాయిలు పడి చచ్చేలా అనిపించాడు. కటౌట్ చూసి కొన్ని కొని నమ్మేయాలి డ్యూడ్. ఇండస్ట్రీని ఏలతాడని మొదటి సినిమాతోనే సీనియర్ మాటల రచయితలు పరుచూరి సోదరులు తో సహా మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ముక్త కంఠంతో చెప్పారు. అలానే ప్రభాస్ టాలీవుడ్ లో స్టార్ గా ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి పెద్ద సమయమేమి పట్టలేదు. 

 

ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అంటే అందరి నోటి వెంటా వచ్చే ఒకే ఒక్క పేరు ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా ఆ పేరుకి అంత పాపులారిటి ఉంది మరి. ఆ హైట్ పర్సనాలిటి చూస్తే ఏ హాలీవుడ్ హీరోనో అనుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడికెళ్ళినా తను తెలుగు వాడిననని టాలీవుడ్ లో హీరోని అని మాత్రమే సింపుల్ గా చెప్పుకుంటాడు. ఇక ప్రభాస్ చేసిన సినిమాలన్ని ఎంతో స్టైలిష్ గా ఉంటాయని అందరికి తెలిసిందే. మేకోవర్ లో ప్రభాస్ రారాజే అని చెప్పాలి. ట్రెండీగా ఉండాలంటే ప్రభాస్ ని చూసే నేర్చుకోవాలి. 

 

ఇక తన హీరోయిన్స్ విషయంలో ప్రభాస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. వాస్తవంగా చెపాలంటే ప్రభాస్ ఎంత పొడగరో అంత సిగ్గరి అని చాలామంది సరదాగా కామెంట్ చేస్తుంటారు. ఎందుకంటే కటౌట్ భారీగా ఉన్నప్పటికి అమ్మాయిల విషయంలో మాత్రం చాలా సిగ్గు పడతాడని టాక్ ఉంది. ఇక హీరోయిన్స్ విషయంలోను ప్రభాస్ అంతే సిగ్గు పడుతుంటారట. అయితే అనుష్క, కాజల్ తో మాత్రం కాస్త ఫ్రీగా ఉండగలుగుతారట. ఈ ఇద్దరిలో కూడా స్వీటి అనుష్క అంటే ఇంకాస్త క్లోజ్ గా ఉంటారని అంటుంటారు.

 

అందుకు కారణం అనుష్క ప్రభాస్ కి లక్కీ హీరోయిన్ అన్న టాక్ ఉంది. ఎందుకంటే ప్రభాస్ అనుష్క కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి ఫ్రాంఛైజీ చేశారు. ఈ మూడు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యం గా బాహుబలి అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసింది. అందుకే ప్రభాస్ కి అనుష్క కాంబినేషన్ అంటే బాగా ఇష్టం. అంతే కాదు తను లక్కీ హీరోయిన్ అని కూడా ప్రభాస్ ఫీలవుతుంటాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: